సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!

Continues below advertisement

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో 359 స్కోర్ చేసి కూడా టీమిండియా ఓడిపోవడంతో ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ తగిలినట్లైంది. ముఖ్యంగా మన జట్టు చెత్త ఫీల్డింగ్, పరమ చెత్త బౌలింగ్ ఫ్యాన్స్‌ని బాగా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఇలాంటి బౌలింగ్‌తో, ఫీల్డింగ్‌తో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడితే ఇండియా కప్పు కొట్టడం కలేనంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఫస్ట్ వన్డేలోనే 349 పరుగుల టార్గెట్‌ని కాపాడుకోవడానికి మన బౌలర్లు చెమటోడ్చారు. హర్షిత్ రాణా, కుల్దీప్ అత్యవసర సమయాల్లో వికెట్లు తీయడంతో ఎలాగోలా కష్టపడి గెలిచారు.

కానీ రెండో వన్డేలో వాళ్లిద్దరూ కూడా చేతులెత్తేయడంతో సఫారీ బ్యాటర్లు ఏదో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లు బౌండరీల మోత మోగించి పరుగుల వరద పారించారు. 359 టార్గెట్‌ని 49.2 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసేశారు. అర్షదీప్, ప్రసిద్ధ్ చెరో 2 వికెట్లు తీసినా.. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లలోనే 85 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షిత్ రాణా కూడా 10 ఓవర్లలో 70 పరుగులిచ్చాడు. స్పిన్‌‌లో వాషాంగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా కంప్లీట్‌గా ఫెయిల్ అయితే.. ఈ సారి కుల్దీప్ కూడా చేతులెత్తేశాడు. దీంతో ఈ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్ రోహిత్, కోహ్లీలకు సారీ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

సారీ.. రోకో.. వయసు మీద పడుతున్నా 2027 వరల్డ్ ఆడాలని, ఎలాగైనా కప్పు కొట్టి వన్డే ప్రపంచకప్ గెలవాలనే కలని తీర్చుకోవాలని కోహ్లీ, రోహిత్ పట్టుదలగా ప్రయత్నిస్తూ.. సూపర్ ఫామ్‌తో ఇరగదీస్తూ.. మీరిద్దరూ కుర్ర ప్లేయర్ల కంటే అదరగొడుతుంటే.. మరో పక్క మన బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రం.. రోజురోజుకూ దిగజారుతూ పరమ చెత్త స్టేజ్‌కి పడిపోతోంది. ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచకప్ గెలవడం పక్కనుంచితే గ్రూప్ స్టేజ్ కూడా దాటడం కష్టమే’ అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. మరి ఈ బౌలింగ్‌పై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే బుమ్రాతో పాటు ఇంకెవరైనా బౌలర్‌ని టీమ్‌లోకి తీసుకోవాలని మీరనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola