Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్‌బై
ఐపీఎల్ స్టార్ ప్లేయర్ ఫాఫ్ డూప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐపీఎల్ 2026లో తాను ఆడబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఐపీఎల్ 2026 కు సంబంధించి జరగనున్న వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని ప్రకటించాడు. ఐపీఎల్ కెరీర్లో తనకు మద్దతుగా నిలిచిన ఫ్రాంచైజీ మేనేజ్మెంట్, కోచ్‌లు, ప్లేయర్స్ అందరిని థాంక్స్ చెప్పాడు.
'ఐపీఎల్‌లో 14 సీజన్ల జర్నీ తర్వాత, ఈ ఏడాది జరగనున్న వేలంలో నా పేరు నమోదు చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా కెరీర్లో ఈ లీగ్ ఒక పెద్ద భాగం. భారత్ నాకు ఎంతో ఇచ్చింది. స్నేహితులను ఇచ్చింది, పాఠాలు నేర్పింది, ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఇండియాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మరో ఛాలెంజ్ తీసుకున్నాను. ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడాలని డిసైడ్ అయ్యాను. ఇదొక అరుదైన అవకాశంగా భావిస్తున్నాను' అని డూప్లెసిస్ రాసుకొచ్చాడు.
డూప్లెసిస్ నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఐపీఎల్ ను వదులుకొని పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతుండడంతో ఇండియాలోని ఫాఫ్ డూప్లెసిస్ ఫ్యన్స్ డిస్సపాయింట్ అయ్యారు అనే చెప్పాలి.