England Players Applaud to Jadeja | జడేజా బ్యాటింగ్ కు ఇంగ్లాండ్ ప్లేయ్సర్ షాక్
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో ఇండియాను ఓడించింది. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా మాత్రమే ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మిగతా వాళ్లంతా అలా వచ్చి ఇలా పెవిలియన్ కు చేరుకున్నారు. అయితే ఈ టెస్ట్‌లో ఇండియా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఒకరినొకరు తిట్టుకున్నారు. నిజం చెప్పాలంటే 2021లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో జరిగిన మ్యాచ్ ని మరోసారి గుర్తు చేసారు. కానీ ఈ మ్యాచ్ చివరిలో మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్స్ ట్రూ స్పోర్ట్స్మన్ షిప్ చూపించారు.
మ్యాచ్ గెలవడానికి చివరివరకు జడేజా చాలా ప్రయత్నించాడు. జడ్డు దూకుడు చూసి ఈ మ్యాచ్ మనదే అని ఇండియా ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సిరాజ్ అవుట్ అవడంతో మ్యాచ్ చేజారిపోయింది. ఇండియా చేసిన పోరాటానికి ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా షాక్ అయ్యారు. చివరి వికెట్ పడగానే బెన్ స్టోక్స్ జడేజాను కౌగిలించుకున్నాడు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ అందరు వచ్చి జడేజాను స్పెషల్ గా అప్ప్రీషియేట్ చేసారు. గేమ్ మీద ఉన్న రెస్పెక్ట్, స్పోర్ట్స్మన్ షిప్ తో ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంత జడేజాకు ప్రత్యేకంగా అప్లౌడ్ చేసారంటూ జడేజా ఫ్యాన్స్ అందపడిపోతున్నారు.
అయితే లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో జడేజాకు స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. సాధారణంగా గెలిచిన టీంకు స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారు. కానీ గెలిచినా టీంతోపాటు ఓడిపోయిన టీంకు కూడా స్టాండింగ్ ఒవేషన్ దక్కడం... అది కూడా లార్డ్స్ స్టేడియంలో అనేది క్రికెట్ హిస్టరీలోనే ఇలా జరగడం చాలా రేర్. ఇంగ్లాండ్ టీంపై గెలవడానికి ఇండియన్ ప్లేయర్స్ పెట్టిన ఎఫ్ర్ట్స్ కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.