Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్

Continues below advertisement

చెన్నైలో సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 270 పరుగుల మారథాన్ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 

ఈ భారీ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన మైండ్ గేమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్‌లో 44 పరుగులు చేసిన వైభవ్, ఫీల్డింగ్‌లో అద్భుతమైన వ్యూహాలతో జట్టుకు కీలక వికెట్లు అందించాడు. సౌత్ జోన్ స్టార్ బ్యాటర్ రికీ భుయ్ ఔట్ విషయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్‌ను పట్టుబట్టి ఒప్పించి డీఆర్‌ఎస్ తీసుకోమన్నాడు. వైభవ్ చెప్పినట్లే రివ్యూలో బాల్ బ్యాట్‌ను తాకినట్లు కనిపించింది. అంపైర్ నాటౌట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు.

అంతేకాకుండా, ఇషాన్ కిషన్ గ్రౌండ్ వీడిన సమయంలో ఇంటెరిన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వైభవ్.. గాయం నుండి కోలుకుని వచ్చిన సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని వెంటనే బౌలింగ్‌కు తెచ్చాడు. వైభవ్ చాకచక్యంతో సౌత్ జోన్ తీవ్ర ఒత్తిడిలో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 6 వికెట్లకు 242 రన్స్ మాత్రమే చేసి ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola