Dhoni ICC Hall Of Fame 2025 | ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ధోని

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని హాల్ ఆఫ్ ఫేమ్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చేర్చింది. అంతర్జాతీయ, భారత క్రికెట్‌కు ధోని చేసిన కృషికి గాను  ఈ గౌరవం లభించింది. ఎంఎస్ ధోనితో పాటు 7 మంది దిగ్గజ క్రికెటర్లకు హాల్ ఆఫ్ ఫేమ్‌తో సత్కరించారు.

ఎంఎస్ ధోనితోపాటు, మాథ్యూ హెడెన్, గ్రేమ్ స్మిత్, డేనియల్ వెట్టోరి, హషీమ్ ఆమ్లాను హాల్ ఆఫ్ ఫేమ్‌తో గుర్తించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ ధోని. అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత దాదాపు 5 సంవత్సరాల తర్వాత ధోనికి ఈ గౌరవం లభించింది. ధోని 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఎంఎస్ ధోని చివరి మ్యాచ్ 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్ ఆడాడు.  

అయితే హాల్ అఫ్ ఫ్రేమ్ లో ధోనికి చోటు దక్కింది. కానీ సచిన్ రికార్డుని మాత్రం ఎవరు టచ్ చేయలేక పోతున్నారని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతుంది. ధోని సాధించిన అంతర్జాతీయ పరుగులు 17,266... సచిన్ 34,357 పరుగులు సాధించారు. 

హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించాలంటే బ్యాటర్లు కనీసం 8,000 అంతర్జాతీయ పరుగులు, 20 సెంచరీలు చేసి ఉండాలి. లేదా కెరీర్ అవేరేజ్ 50 కంటే ఎక్కువ ఉండాలి. టెస్ట్ లేదా వన్డే ఫార్మాట్లలో బౌలర్లు కనీసం 200 వికెట్లు తీసి ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే ప్లేయర్స్ హాల్ అఫ్ ఫ్రేమ్ కి అర్హులు అవుతారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola