DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. బేసిక్ గా పవర్ ప్లే అంటేనే బ్యాటర్లకు కొంచం అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పవర్ ప్లే లో ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. భువనేశ్వర్ కుమార్ రెండో బాల్ కె సాహిల్ పరఖ్‌ను డకౌట్ చేసాడు. ఆ తర్వాత జోష్ హేజిల్‌వుడ్ తన ఓవర్‌లో కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీలను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బ తీశాడు. 16 బంతులో ఢిల్లీ 5 కీలక వికెట్లు కోల్పోయింది. కేవలం 8 పరుగుల వద్ద 6వ వికెట్ పడటంతో స్టేడియం మొత్తం షాక్‌ అయింది. 

పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే అతి తక్కువ పవర్ ప్లే స్కోరు చేసిన టీమ్ గా ఢిల్లీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ 30 పరుగులతో ఒంటరి పోరాటం చేయడంతో ఢిల్లీ స్కోరు 75 పరుగులు అయింది. డేవిడ్ మిల్లర్, జెమీసన్ తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివరికి 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola