CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ

ఐపీఎల్ 2026 సీజ‌న్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెన‌ర్ సంజూ శాంస‌న్ ఈ సీజ‌న్ లోనే తొలి సెంచ‌రీని సాధించాడు. 56 బంతుల్లో 115 నాటౌట్ గా నిలిచి 15 ఫోర్లు, 4 సిక్సర్లతో స‌త్తా చాటాడు. 

టాస్ ఓడి ఫ‌స్ట్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 212 ప‌రుగులు చేసింది. శాంస‌న్ .. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. ఒక ఎండ్ లో ఓపెన‌ర్ క‌మ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నెమ్మ‌దిగా ఆడగా, శాంస‌న్ మాత్రం బౌండ‌రీల‌తో రెచ్చిపోయాడు. దీంతో ప‌వ‌ర్ ప్లేలో ప‌ది ప‌రుగుల‌కు పైగా ర‌న్ రేట్ తో 61 ప‌రుగులు సాధించింది. తొలి వికెట్ న‌మోదైన 62 ప‌రుగుల‌ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. 

ఇంత‌లో 26 బంతుల్లో శాంస‌న్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా, కాసేప‌టికి 27 బంతుల‌కు మాత్రే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ గా ఆయుష్ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ చేరాడు. కేవలం 52 బంతుల్లోనే శాంస‌న్ సెంచ‌రీ చేయ‌డం విశేషం. అత‌ని కెరీర్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచ‌రీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola