CSK Releasing Matheesha Pathirana | పతిరనా కోసం KKR తో CSK డీల్ ?
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ( IPL 2026 Mini Auction ) ముందు చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. టీమ్ ఫ్యూచర్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న CSK మానేజ్మెంట్ .. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే సంజూ శాంసన్ కోసం.. రవీంద్ర జడేజా ( Jadeja ), సామ్ కర్రన్‌లను ( Sam Curran ) వదిలేసింది. వికెట్ కీపింగ్ అండ్ బ్యాట్సమన్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సీఎస్కే తీసుకున్న మరో కఠినమైన నిర్ణయంతో ఫ్యాన్స్ కు ఎం చేయాలో కూడా అర్థం కావడం లేదు. గత మూడు సీజన్లలో CSK ను ఎన్నో మ్యాచులో గెలిపించిన మతీశ పతిరనాను ( Matheesha Pathirana ) కూడా వదిలేసుకుంటుంది. పతిరనా 2022లో సీఎస్కేలో చేరాడు. అయితే CSK తీసుకుంటున్న ఈ నిర్ణయం వెనక ఉన్న కారణం డబ్బులు అని అంటున్నారు విశ్లేషకులు. పతిరనాను విడుదల చేస్తే 13 కోట్లు CSK పర్స్‌లో చేరుతాయి అని మానేజ్మెంట్ అనుకుంటునట్టు తెలుస్తుంది. అయితే పతిరనా కోసం KKR ... CSKతో ట్రేడ్ కు ప్రయత్నించింది. కానీ ఆశించిన సమాధానం KKR కు CSK నుంచి రాలేదట.