Cristiano Ronaldo FIFA World Cup 2026 | వరల్డ్ కప్‌లో రోనాల్డో అట్టర్ ప్లాప్

Continues below advertisement

ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫస్ట్ మ్యాచ్‌లోనే పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రోనాల్డోకు ఊహించని షాక్ తగిలింది. డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్ 1-1 తో డ్రా కాగా, రోనాల్డో ప్రదర్శనపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. "టీమ్ గోల్స్ కొట్టాలి, నువ్వు కాదు" అని థియరీ హెన్రీ చెప్పిన మాటలు రోనాల్డోకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

టెక్సాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 41 ఏళ్ల రోనాల్డో కేవలం 25 సార్లు మాత్రమే బాల్ టచ్ చేశాడు. ఒక్క షాట్ కూడా ఆన్ టార్గెట్ కొట్టలేకపోయాడు. ఒక మోడర్న్ గ్రేట్ స్ట్రైకర్‌కు ఇవి అత్యంత దారుణమైన నంబర్స్. నిజానికి వరల్డ్ కప్ హిస్టరీలోనే ఓల్డెస్ట్ అవుట్‌ఫీల్డ్ ప్లేయర్‌గా రోనాల్డో రికార్డ్ క్రియేట్ చేసినప్పటికీ, గత 10 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. 

మెస్సితో కంపేర్ చేస్తే.. మెస్సికి వేగం లేకపోయినా డీప్ రోల్ ప్లే చేస్తూ టీమ్‌ను గెలిపిస్తున్నాడు, కానీ రోనాల్డో మాత్రం ఫార్వర్డ్‌లోనే ఉంటూ పోర్చుగల్ గేమ్ ప్లాన్‌ను దెబ్బతీస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోనాల్డో ఉన్నప్పుడు పోర్చుగల్ గోల్ యావరేజ్ 2.8 నుండి 1.9 కి పడిపోవడం దీనికి నిదర్శనం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola