Rohit Sharma vs South Africa: అటాకింగ్ బ్యాటింగ్ తో టోన్ సెట్ చేస్తున్న రోహిత్ శర్మ
Rohit Sharma vs South Africa: సౌతాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత చర్చ అంతా కింగ్ విరాట్ కోహ్లీ గురించే. దానికి కచ్చితంగా అర్హుడే. సాధించిన రికార్డ్ అలాంటిది మరి. కానీ జట్టు కోసం రోహిత్ శర్మ ఆడుతున్న తీరు గురించి చాలా తక్కువ మందే మాట్లాడుకుంటారు.