David Miller Century: కిల్లర్ మిల్లర్ ఇన్నింగ్స్ - అవతల తడబడ్డా, ఇవతల నిలబడ్డాడు..!
David Miller Century: అవతల ఉన్నది వరల్డ్ కప్స్ లో చాలాసార్లు చావుదెబ్బ తీసిన ఆస్ట్రేలియా. మరోసారి సెమీఫైనల్ లో ఎదురుపడ్డారు. ఇంతటి కీలకమైన మ్యాచ్ లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ కు దిగీ దిగగానేన కొలాప్స్. బ్యాటర్లు సైకిల్ స్టాండ్ ను తలపించారు. 24 పరుగులకు నాలుగు వికెట్లు. 12 ఓవర్లు అయిపోయాయి. సెమీఫైనల్ చప్పగా సాగుతుందేమో అనుకుంటే... అప్పుడు క్లాసెన్ కు జతకలిశాడు కిల్లర్ మిల్లర్.