Why Asia Cup Format Changes | ఆసియా కప్ ఫార్మాట్ ఎందుకు మారుతుంటుంది? | ABP Desam
1984లో మొదలైన ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఆడటం మొదలు పెట్టారు. 2016లో ఆసియా కప్ లో తొలిసారి టీ20 ఫార్మాట్‌లో ఆడారు. ఆ సంవత్సరం నుంచి ఒకసారి వన్డే, మరోసారి టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్నారు. 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులో భాగంగా ఇలా ఫార్మాట్ రొటేషన్ పద్ధతిని మొదలు పెట్టారు.
ఆసియా కప్ తర్వాత జరిగే ఐసీసీ టోర్నమెంట్ ఏ ఫార్మాట్ లో ఉంటుందో.. అదే ఫార్మాట్‌నే ఆసియా కప్‌లో ఉంటుంది. 2016లో ఆసియా కప్ తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగింది. వరల్డ్ కప్ కూడా టీ20 ఫార్మాట్ లోనే జరిగింది. 2018లో ఆసియా కప్ వన్డేగా జరిగింది, ఎందుకంటే 2019లో వరల్డ్ కప్ వన్డే కూడా జరిగింది.
2025లో జరుగుతున్న ఆసియా కప్ టీ20 ఫార్మాట్ లో మూడోసారి జరుగుతుంది. వచ్చే సంవత్సరం వరల్డ్ కప్ టీ20 ఫార్మాట్ లో జరుగుతుంది. ఈ విధంగా ఐసీసీ ప్రధాన టోర్నమెంట్‌ల ప్రకారం ఆసియా కప్ ఫార్మాట్ మారుతోంది.