Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam

Continues below advertisement

ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో సెనురన్ ముత్తుసామి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముత్తుసామి బ్యాటింగ్ లో సఫారీ గట్టి పట్టు సాధించింది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని కసితో ఉన్న టీమ్ ఇండియా కు షాక్ ఇచ్చాడు. ఓవర్‌నైట్ స్కోర్ 247/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికా, లంచ్ బ్రేక్ కు 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. క్రీజులో పాతుకుపోయిన సెనూరన్ ముత్తుసామి, 194 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముత్తుసామికి ఇదే మొదటి ఇంటర్నేషనల్ సెంచరీ. 

206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109 పరుగులు చేసిన ముత్తుసామి చాలా క్లాస్ గా గేమ్ ఆడాడు. వికెట్ కాపాడుకుంటేనే... మంచి భాగస్యామ్యంతో రన్స్ బోర్డు ను పరుగులు పెట్టించి భారత బౌలర్లకు తలనొప్పిని తెప్పించాడు. 

పేరులో ముత్తుసామి అని వినగానే ఇతను ఇండియన్ అంటూ.. తన గురించి వెతకడం మొదలు పెట్టారు. సెనూరన్ ముత్తుసామి భారత సంతతికి చెందినవాడు. సెనూరన్ ముత్తుసామి తండ్రి ముత్తుసామి, తమిళనాడులోని నాగపట్నం ఏరియాకి చెందినవాడు. సౌతాఫ్రికా లో సెటిల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న ముత్తుసామి, అండర్–11 నుండి అండర్–19 వరకు క్వాజులు నాటల్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో తొలిసారిగా ఇండియాపైనే ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసాడు. బ్యాట్స్‌మన్‌గా మొదలై.. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చడంతో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola