సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

చెన్నై సూపర్ కింగ్స్‌కి అంటే MS ధోని. ఈ రేంజ్‌లో ఫిక్స్ అయిపోయారు ఐపీఎల్ ఫ్యాన్స్. కానీ..2025లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం తలా ఆడతాడా లేదా అన్న కన్‌ఫ్యూజన్‌ కంటిన్యూ అవుతోంది. కౌన్సిల్ తెచ్చిన కొత్త రూలే..ఇందుకు కారణం. కౌన్సిల్ తీసుకొచ్చిన Uncapped Rule పై పెద్ద డిబేటే జరుగుతోంది. ఇప్పుడు CSKలోకి ధోనీని రిటైన్ చేసుకోవాలంటే..అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గానే తీసుకుంటారన్న డిస్కషన్ మొదలైంది. ఒకవేళ ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకుంటే...ఆక్షన్‌లో 4 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చేందుకు వీలుండదు. జనరల్‌గా అయితే..ధోనీకి డిమాండ్ ఎక్కువ. కానీ..ఈ రూల్‌తో అది తగ్గిపోతుంది. 2022 మెగా ఆక్షన్‌లో సీఎస్‌కే...ధోనీని రిటైన్ చేసుకుంది. 

అప్పుడు 12 కోట్లు పెట్టి మరీ తలాని తీసుకుంది. అయితే..ఈ రూల్ ప్రకారం..గత ఐదేళ్లలో ఓ ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదంటే..అన్‌క్యాప్డ్ లిస్ట్‌లో పెడతారు. ధోనీ 2019లో వరల్డ్ కప్ ఆడాడు. ఆ తరవాత ఇంటర్నేషనల్ మ్యాచ్‌ ఆడలేదు. అందుకే..ఈ సారి అన్‌క్యాప్డ్‌ లిస్ట్‌లో ధోనీ పేరుంది. అయితే..అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడడానికి తలా ఒప్పుకుంటాడా లేదా అన్నదే ఉత్కంఠ పెంచుతున్న విషయం. 2023 లో నీ సర్జరీ అయిన తరవాత CSK కేప్టెన్సీని..రుతురాజ్ గైక్వాడ్ చేతుల్లో పెట్టాడు ధోనీ. ప్లేయర్ రిటెన్షన్ రూల్స్‌  ఫైనలైజ్ అయిన తరవాతే డిసిషన్ తీసుకుంటానని ఈ మధ్యే ఓ ఈవెంట్‌లో తేల్చి చెప్పాడు. దీనిపై తలా ఓ క్లారిటీ ఇచ్చేంత వరకూ సస్పెన్స్ తప్పదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola