Washington Sundar Impact Player Of the Series | Jadeja వారసుడు వచ్చేశాడు...బ్రిటన్ గడ్డపై వాషీ అదుర్స్ | ABP Desam
రవీంద్ర జడేజా..పరిచయం అక్కర్లేని ఆల్ రౌండర్. అసలు ఓ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ ఏడేళ్లు నెంబర్ 1 ఆల్ రౌండర్ గా ఉండటమే గొప్ప విషయం. అటు బ్యాటింగ్ తో..ఇటు బౌలింగ్ తో..మరో వైపు ఫీల్డింగ్...జడేజా మ్యాచ్ మీద చూపించే ఇంపాక్ట్ ను లెక్కపెట్టలేం. అతను ఆపే బౌండరీలతో, చేసే రనౌట్లతో ఇండియా బతికిపోయిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. అలాంటిది జడ్డూ ఇప్పుడు తన కెరీర్ చరమాంకానికి వచ్చేశాడు. ఇప్పటికీ ఫుల్ ఫిట్ గానే ఉన్నాడు..ప్రదర్శన పరంగానూ ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దుమ్ము రేపాడు. ఏకంగా 516 పరుగులు బాదాడు ఈ సిరీస్ లో. ఇందులో ఓ సెంచరీ, 5హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బర్మింగ్ హామ్, లార్డ్స్ లో రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు కొట్టాడు. మాంచెస్టర్ లో అయితే సెంచరీతో పాటు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. పేసర్లకు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్ లపై సిరీస్ లో ఏడు వికెట్లు తీశాడు. కానీ జడేజాకు 37ఏళ్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో జడేజాకు వారసుడిని వెతికే పనిలో ఉంది టీమిండియా. బట్ ఈ ఇంగ్లండ్ తో జడేజా సక్సెసార్ ఎవరనే విషయంపై స్పష్టత వచ్చేసింది. వాషింగ్టన్ సుందర్. ఈ సిరీస్ లో నాలుగు టెస్టులు ఆడిన 25ఏళ్ల సుందర్ 284 పరుగులు చేశాడు. ఏడు వికెట్లు తీశాడు. లార్డ్స్ టెస్టులో నాలుగు వికెట్లు తీసిన సుందర్...మాంచెస్టర్ టెస్టులో శతకం బాది జడేజాతో కలిసి మ్యాచ్ ను డ్రా చేసి ఇంగ్లండ్ కు షాక్ ఇచ్చాడు. ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కీలక హాఫ్ సెంచరీ కొట్టి జట్టును ఆదుకున్న వాషీ...ఈ సిరీస్ కి గానూ ఇంపాక్ట్ ప్లే యర్ గా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు, మెడల్ కూడా జడేజానే వాషింగ్టన్ సుందర్ కి ఇవ్వటం గమనార్హం. మెడల్ ఇచ్చేప్పుడు కూడా జడేజా
వషీ..ఆజా బేటా..ఏ లేలే అన్నాడు. అంటే తన వారసుడు సుందరే అనే విషయాన్ని జడేజా కూడా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆత్మీయంగా హత్తుకుని అభినందించాడు సుందర్ ను. చూడాలి జడేజా స్థాయిలో భవిష్యత్తులో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్..రైట్ హ్యాండ్ అయిన వాషింగ్టన్ సుందర్ టీమిండియాకు ఎంత హెల్త్ అవుతాడో. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో.