Virat Kohli vs Cornad Grovel Row | నోటి దురదతో వాగాడు...కింగ్ బ్యాట్ తో బాదించుకున్నాడు | ABP Desam
సౌతాఫ్రికా కోచ్ షుక్రీ కార్నాడ్ కి తెలియదు ఏమో విరాట్ కోహ్లీ ఇగోని ఎవడైనా టచ్ చేస్తే వడ్డీతో సహా చెల్లించేస్తాడని...అందుకే సిరీస్ కి ముందు గ్రోవెల్ అంటూ పిచ్చి వాగుడు వాగాడు. వాస్తవానికి గ్రోవెల్ అనేది క్రికెట్ లో నిషేధిత పదం. దీనికి డిస్క్రిమినేషన్ అలాగే జాత్యంహకార నేపథ్యం ఉండటంతో చాలా ఏళ్లుగా ఈ పదాన్ని క్రికెట్ లో వాడటం మానేశారు. మోకాళ్ల మీద కూర్చునేలా చేస్తాం..లేదా సాష్టాంగ పడి మమ్మల్ని వదిలేయమని అడుక్కునేలా చేస్తాం అని గ్రోవెల్ పదానికి బ్రాడ్ మీనింగ్. భారత్ తో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు ఆ జట్టు కోచ్ షుక్రీ కార్నాడ్ ఈ పదం వాడాడు. భారత్ ని ఫాలో ఆన్ ఎందుకు ఆడించలేదు అంటే వాళ్లు గ్రోవెల్ అయ్యేలా చేస్తాం అన్నాడు. అన్నట్లుగానే భారత్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓడిపోయింది. వైట్ వాష్ మూటగట్టుకుంది. కానీ ఆ పదం తాలుకూ మనిషి నోటి దురదను ఒకడు మాత్రం సహించలేకపోయాడు. తనే విరాట్ కోహ్లీ. రాంచీలో జరిగిన మొదటి వన్డేలో సెంచరీ కొట్టిన విరాట్ ఆ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక్కడికి మాత్రం ఇవ్వలేదు. అప్పుడే అందరికీ అర్థమైంది. విరాట్ కోహ్లీ భారత్ ను అతను అవమానించిన తీరును మనసులో పెట్టుకున్నాడని తర్వాత గుహవటి, ఆ తర్వాత వైజాగ్. ప్లేస్ లు మారాయి. మధ్యలో ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. కానీ విరాట్ కోహ్లీ మాత్రం మచ్చలపులిలా మీదడిపోయాడు. మొదటి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన కోహ్లీ...నిన్న వైజాగ్ వన్డేలో 65 పరుగులు చేశాడు. లక్ష్యం తక్కువ కాబట్టి సరిపోయింది కానీ నిన్న కోహ్లీ ఇంటెన్షన్ చూస్తే సెంచరీ చేయకుండా తనను ఏ శక్తి ఆపేలా కనిపించలేదు. విరాట్ వీరబాదుడుకు ఈ సిరీస్ లో మూడొందల పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీ దక్కటంతో పాటు మన జట్టు 2-1 తేడాతో సిరీస్ నూ కైవసం చేసుకుంది. సీనియర్లు లేని టెస్ట్ జట్టుతో మ్యాచ్ ల్లో గ్రోవెల్ వాగుడు వాగిన కోచ్ కార్నాడ్...వన్డే సిరీస్ అయిపోయాక తను ఆ మాట అనకుండా ఉండాల్సిందని క్షమాపణ చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. ఆల్రెడీ ఉన్న గుండునే కార్నాడ్ కి మళ్లీ కొట్టి మరీ వెళ్లాడు విరాట్ కోహ్లీ.