Virat Kohli Jersey Auction | విరాట్ కొహ్లీకి ఓ రేట్ కట్టిన అభిమానులు | ABP Desam

 విరాట్ కొహ్లీ. పరుగులు మరిగిన హంగ్రీ చీతా. అందుకే అభిమానుల్లో అతనంటే ప్రత్యేకమైన క్రేజ్. అది ఎంతెలా అంటారా కొహ్లీ జెర్సీ నెంబర్ 18ని ఆక్షన్ పెట్టారు. ఎంతకు కొనుక్కున్నారో తెలుసా అక్షరాలా 40 లక్షల రూపాయలకు. అంతే కాదు కొహ్లీ వాడిన హ్యాండ్ గ్లోవ్స్ 28 లక్షల రూపాయలకు వేలం పాటలో కొనుక్కున్నారు. కేవలం కొహ్లీ నే కాదు రోహిత్ శర్మ బ్యాట్ 24లక్షలు, ధోని బ్యాట్ 13లక్షలు, కేఎల్ రాహుల్ జెర్సీ 11 లక్షలకు వేలం పాటలో కొనుక్కున్నారు. ఇదంతా వేలం వేశారు అనేగా క్రికెటర్ కేఎల్ రాహులే స్వయంగా ఈ ఆక్షన్ ను నిర్వహించారు. రాహుల్ భార్య అతియాశెట్టి తన అమ్మమ్మ విపులా ఖాద్రి స్థాపించిన విప్ల ఫౌండేషన్ ను నిర్వహిస్తోంది. ఫాండేషన్ తరపున బధిరులు, మేధోపరమైన బలహీనత ఉన్న పిల్లల కోసం ఓ స్పెషల్ స్కూల్ ను స్టార్ట్ చేశారు రాహుల్ దంపతులు. ఈ స్కూల్ కు సాయం కోసం ఇలా క్రికెటర్లతో మాట్లాడి వాళ్ల జెర్సీలను తెప్పించుకుని వేలానికి పెట్టాడు రాహుల్. అభిమానులు కూడా ఆ కారణాన్ని అర్థం చేసుకుని మరో వైపు క్రికెటర్లపై తమకున్న ప్రేమను చాటుకుంటూ పోటీ పడి మరీ కొనుక్కున్నారు. విరాట్ కొహ్లీ జెర్సీ సాధించిన 40 లక్షలతో మొత్తం వేలం పాటలో కోటి 93లక్షల రూపాయలు ఫౌండేషన్ కు వచ్చాయి. అభిమానులకు కేఎల్ రాహుల్, అతియాశెట్టి కృతజ్ఞతలు తెలిపారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola