Vaibhav Sooryavanshi U19 World Cup Final | ఏడాదిలో వీర విధ్వంసం సృష్టించిన వైభవ్ | ABP Desam

Continues below advertisement

 వైభవ్ సూర్యవంశీ. ఏడాది క్రితం వరకూ ఎవ్వరికీ పెద్దగా తెలియని పేరు. ఎప్పుడైతే రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఆక్షన్ లో కోటి పదిలక్షలు పెట్టి వైభవ్ సూర్యవంశీ అనే 14ఏళ్ల పిల్లాడిని కొనుక్కున్నాడో ఈ పిల్లాడిలో ఏమై ఉంటుంది ఆ టాలెంట్ అని అందరికీ డౌట్స్ వచ్చి ఉంటాయి. కానీ వైభవ్ తన మొదటి ఐపీఎల్ టోర్నీలో భారీ సెంచరీతో అందరి సందేహాలు తీర్చేశాడు. 35 బాల్స్ లో సెంచరీ కొట్టి ఐపీఎల్ లో అతి చిన్న వయస్సులో సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డులు నెలకొల్పటంతో మొదలైన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం ఈ ఏడాది కాలంలో బ్రహ్మాండంగా సాగింది. టీ20 ఫార్మాట్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ కొట్టాడు. వన్డే ఫార్మాట్ విజయ్ హజారేలో సెంచరీ కొట్టాడు. ఆసియా కప్ అండర్ 19లో సెంచరీ కొట్టాడు. ఇండియా ఏ తరపున పంపిస్తే అక్కడా సెంచరీ బాదాడు. ఇప్పుడు నిన్న అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ పై 175 పరుగులతో ఊచకోత కోశాడు. టోర్నీ అంతా 180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. టీ20ల్లో ఇది పెద్ద స్ట్రైక్ రేట్. అలాంటిది వన్డే టోర్నీల్లోనూ ఈ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ ఏడాది వైభవ్ ఆడిన అన్ని మేజర్ టోర్నమెంటుల్లోనూ సెంచరీలు కొట్టడం విశేషం. ప్రస్తుతం వైభవ్ వయస్సు 14ఏళ్ల 316 రోజులు. ఇప్పుడు రాబోయే ఐపీఎల్ లో వైభవ్ రాణిస్తే...ఈ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా టీ20 జట్టు తలుపులు తట్టడం ఖాయం. అదే జరిగితే16ఏళ్లకే దేశానికి ఆడిన క్రికెటర్ గా ఇన్నాళూ ఉన్న సచిన్ రికార్డును 15ఏళ్లకే భారత్ కు ఆడిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ బద్ధలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola