Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

 సంచలన బ్యాటింగ్ తో టీమిండియా క్రికెట్ లో చిచ్చరపిడుగుగా పేరు తెచ్చుకున్న వైభవ్ సూర్య వంశీ 15వ ఏట అడుగు పెట్టాడు. 2011 మార్చి 27న పుట్టిన వైభవ్...బీసీసీఐ నిబంధనల ప్రకారం 15ఏళ్ల అర్హత వయస్సుకు చేరుకున్నాడు. చిన్నారుల మానసిక పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అతని పై ఒత్తిడి లేకుండా ఉండేలా 15ఏళ్ల వరకూ జాతీయ సీనియర్ జట్టులోకి ఆడే అవకాశం లేకుండా బీసీసీఐ ఓ రూల్ ను కొనసాగిస్తోంది. ఫలితంగా గతేడాది కాలంగా క్రికెట్లో ఎంత అదరగొట్టినా సీనియర్ జట్టులోకి వచ్చే ఛాన్స్ లేకుండా పోయిన సూర్యవంశీకి ఈ ఏడాది ఆ ప్రతిబంధకం లేదు. గతేడాది 7ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడిన వైభవ్ 252పరుగులు చేశాడు. 200 స్ట్రైక్ రేట్ తో టోర్నీలో దుమ్మురేపటంతో పాటు 38 బాల్స్ లోనే సెంచరీ బాదేసి ఆ ఘనత అత్యంత పిన్నవయస్కుడైన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పడంతో పాటు సెకండ్ ఫాసెస్ట్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. తర్వాత ఆసియా అండర్ 19 కప్, అండర్ 19 వరల్డ్ కప్పుల్లో సంచలన ప్రదర్శనలు చేశాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ పై 175 పరుగులు చేసి భారత్ సంచలన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచేలా చేశాడు. సో ఆ బీభత్సమైన ఫామ్ ను కనుక వైభవ్ ఈ ఐపీఎల్లోనూ కొనసాగిస్తే సెలక్టర్లు అతన్ని జాతీయ జట్టుకు ఆడించక తప్పని సరి పరిస్థితులను కల్పిస్తాడు. అభిషేక్ తో కలిసి ఓపెనింగ్ చేయాలా..ఇషాన్ కిషన్ ను కిందకి నెట్టి వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయాలా ఆలోచించుకోవాలి వైభవ్ అంతే. ఆ స్థాయిలో అతని ఇంపాక్ట్ ఈ సారి ఉండబోతోంది కాబట్టి వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి ఈ సారి కేంద్రీకృతం కానుంది. చూడాలి సోమవారం సీఎస్కేతో జరగబోయే మ్యాచ్ ద్వారా బరిలోకి దిగనున్న ఈ రాజస్థాన్ ఓపెనర్ ఈసారి ఎలా సంచలనాలను సృష్టించనున్నాడో.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola