USA Qualifies Super 8 | T20 World Cup 2024 లో అమెరికా అద్భుతం | ABP Desam
అస్సలు ఎవ్వరూ అనుకోలేదు. యూఎస్ఏ ఈస్థాయిలో చరిత్ర సృష్టిస్తుంది. అమెరికా పేరు చెప్పగానే ఎన్నో రంగాల్లో ఓ దిగ్గజ హోదా ఉండొచ్చు. కానీ క్రికెట్ లో మాత్రం అదొక పసికూన జట్టు. పైగా ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి కుర్రాళ్లు అక్కడ ఉద్యోగాల కోసం వెళ్లి సెటిల్ అయ్యాకనే అక్కడ క్రికెట్ అభివృద్ధి చెందింది. బేస్ బాల్, బాస్కెట్ బాల్ కి అక్కడ ఇచ్చే ప్రాధాన్యాన్ని దాటి క్రికెట్ పైనా అక్కడి ఫ్యాన్స్ దృష్టి మళ్లేలా చేయటంలో ఈ సారి యూఎస్ క్రికెట్ ఆర్మీ సక్సెస్ అయ్యింది. రీజన్ టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశను సక్సెస్ ఫుల్ గా దాటి సూపర్ 8 యూఎస్ఏ అర్హత సాధించటమే. యూఎస్ కు ఆడుతున్న వారిలో చాలా మంది భారతీయ సంతతికి చెందిన వారు, ఇండియా నుంచి ఉద్యోగాల కోసం అక్కడి కి వెళ్లిన వారే. మోనాంక్ పటేల్, జస్దీప్ సింగ్, హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నితీశ్ కుమార్, మిళింద్ కుమార్, నిసర్గ్ పటేల్ ఇలా సగానికి పైగా అమెరికా టీమ్ భారత్ H1B వీసాలతో నిండిపోయింది. ప్రత్యేకించి ఈ సౌరభ్ నేత్రావల్కర్ అనే లెఫార్మ్ పేసర్ భారత్ తరపున అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిపోయిన అక్కడే ఒరాకిల్ టెక్నికల్ స్టాఫ్ లో ప్రిన్సిపల్ మెంబర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా క్రికెట్ జట్టుకు ఎంపికై ఇప్పుడు లీవ్స్ తీసుకుని వరల్డ్ కప్ ఆడుతున్నాడు. గ్రూప్ స్టేజ్ లో ఒక మ్యాచ్ గెలిస్తేనే గొప్ప అనుకున్న USA జట్టు ఇప్పుడు సూపర్ 8 కి అర్హత సాధించటంతో నేత్రావల్కర్ తన లీవ్ ను ఎక్స్ టెండ్ చేసుకోవాల్సి వచ్చింది. పనిలోపనిగా ఈ సూపర్ 8 అర్హత ద్వారా 2026లో ఇండియా, శ్రీలంకల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కి అర్హత సాధించింది అమెరికా జట్టు.