Umpire Controversial Decision SA vs BAN | బంగ్లా కొంప ముంచిన అంపైర్ నిర్ణయం | T20 World Cup 2024
ఒక్క నిర్ణయం చాలు మ్యాచ్ ను మలుపు తిప్పేయటానికి. అది కూడా టీ20 ల్లో...పైగా టీ20 వరల్డ్ కప్పుల్లాంటి పెద్ద ఈవెంట్లలో దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయమే ఒకటి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచులో తీసుకున్నారు అంపైర్. బంగ్లా బౌలర్ల ధాటికి 113పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా..114పరుగుల టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆల్మోస్ట్ మ్యాచ్ ఇచ్చేసినట్లే కనిపించింది. క్రీజులో బలంగా పాతుకుపోయిన తాహిద్ హ్రిదయ్, మహ్మదుల్లా వికెట్ పోనివ్వకుండా పరుగులు రాబట్టడమే కాదు మ్యాచ్ ను చాలా ఎండ్ వరకూ తీసుకువచ్చేశారు. అయితే 17వ ఓవర్ వేసిన రబాడా బౌలింగ్ లో ఓ వివాదాస్పద నిర్ణయం అంపైర్ నుంచి వచ్చింది. ఆ ఓవర్ రెండో బంతికి రబాడా లెగ్ సైడ్ దిశగా వేసిన బంతి తాహిర్ హ్రిదయ్ ప్యాడ్ కి ఎడ్జ్ లో తగిలి లెగ్ సైడ్ ఫోర్ వెళ్లిపోయింది. కానీ రబాడా LBW కి అప్పీల్ చేశాడు. ఆన్ ఫీల్డ్ లో ఉన్న అంపైర్ కూడా వెంటనే అవుట్ ఇచ్చేశాడు. తాహిర్ హ్రిదయ్ రివ్యూ తీసుకోగా తేలింది అంటే బంతి దాదాపు 95శాతం లెగ్ సైడ్ దిశగా బయటకు వెళ్లిపోతుంది జస్ట్ టిప్ ఆఫ్ బాల్ మాత్రమే లెగ్ వికెట్ బెయిల్ కి తాకే అవకాశం ఉంది. ఇలాంటి ఎటూ తేల్చలేని డెసిషన్ వచ్చినప్పుడు థర్డ్ అంపైర్ ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయానికే కట్టుబడతారు. అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవుట్ కాబట్టి హ్రిదయ్ అవుట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. కొట్టిన ఫోర్ తో వచ్చిన నాలుగు పరుగులు కూడా తగ్గాయి. హ్రిదయ్ అవుటయ్యే సమయానికి మ్యాచ్ గెలవాలంటే కావాల్సిన సమీకరణాలు 3 ఓవర్లలో 20 పరుగులు కాగా చేతిలో 6వికెట్లు ఉన్నా మ్యాచ్ ను చేజార్చుకుంది బంగ్లాదేశ్. అది కూడా జస్ట్ నాలుగు పరుగుల తేడాతో. ఏ నాలుగు పరుగులైతే ఫోర్ కొట్టినా అంపైర్ నిర్ణయం కారణంగా స్కోరు బోర్డు నుంచి తగ్గాయో..అదే నాలుగు పరుగులతో బంగ్లా ఓడిపోవటాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.