T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
2026 టీ20 వరల్డ్ కప్ కి బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. రీసెంట్ ఫర్ ఫార్మెన్స్, ఫెయిల్యూర్స్ ఆధారంగా తుది 15 మంది భారత క్రికెట్ బృందాన్ని సెలెక్షన్ కమిటీ. వరుసగా 8 టీ20 సిరీస్ ల విజయంలో కారణమైన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై నమ్మకాన్ని కొనసాగించిన బీసీసీఐ..బ్యాటింగ్ పరంగా ఫామ్ లేకున్నా తననే కెప్టెన్ గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక వైస్ కెప్టెన్ విషయంలో షాకింగ్ డెసిషన్ వచ్చింది. ఫామ్ లో లేని కారణంగా ప్రిన్స్ శుభ్ మన్ గిల్ వరల్డ్ కప్పు జట్టులో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. గిల్ స్థానంలో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఓపెనర్ గా వరల్డ్ కప్ ఆడనున్నాడు. శాంసన్ కి బ్యాకప్ కీపర్ గా సయ్యద్ ముస్తాల్ అలీ టోర్నీ లో అదరగొట్టిన ఝార్ఖండ్ కి కప్ గెలిపించిన ఇషాన్ కిషన్ స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్, సౌతాఫ్రికా సిరీసుల్లో దుమ్మురేపిన తిలక్ వర్మ స్థానం పదిలం చేసుకున్నాడు. సూర్య, దూబే, రింకూ సింగ్ లు స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు . ఆల్ రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు చోటు దక్కించుకున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ వరల్డ్ కప్పులో స్క్వాడ్ లో చోటు దక్కించుకోగా...గంభీర్ ప్రియశిష్యుడు హర్షిత్ రాణా కూడా బ్యాకప్ పేసర్ గా ఎంపికయ్యాడు. స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పంచుకోనున్నారు. మొత్తంగా 15మంది సభ్యులు ఈ జట్టే టీ20 వరల్డ్ కప్పు తో పాటు రాబోయే న్యూజిలాండ్ టీ20 సిరీస్ ను ఆడనుంది.