T20 Wc 2022 Group B : టీమిండియాను టెన్షన్ పెడుతున్న జింబాబ్వే, పాకిస్థాన్ | ABP Desam
బాబోయ్ ఈ రేంజ్ టెన్షన్ ఇండియా రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడూ ఫేస్ చేసి ఉండదు. చూడ్డానికి ధీమాగానే కనిపించినా...ఏదన్నా తేడా జరిగిందా ఇంత టోర్నమెంట్ ఆడి టీమిండియా ఇంటికి వెళ్లాల్సిందే. హా ఏముంది లే జింబాబ్వే నే కదా కొట్టేద్దాం అనుకుంటే...పాకిస్థాన్ ను వాళ్లు మట్టికరిపించిన తీరు మర్చిపోకూడదు. అందుకే ఈ టెన్షన్. మూడు మ్యాచులున్నాయి. రెండు సెమీస్ బెర్తులున్నాయి. నాలుగు టీమ్ లు పోటీలో ఉన్నాయి. ఎస్ టెక్నికల్ గా బంగ్లాదేశ్ కు కూడా ఇంకా అవకాశాలున్నాయి. అసలు గ్రూప్ 2 లో సెమీస్ రేస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.