Suryakumar Yadav Leaving MI Fact Check | KKR కి కెప్టెన్ గా SKY వెళ్తున్నాడా..? | ABP Desam
ఐపీఎల్ లో ఈ ఏడాది ఛాంపియన్స్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తమ కెప్టెన్ ను మార్చుకోవాలనే ఆలోచనలో ఉందా..? ప్రస్తుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను కాదని ముంబై నుంచి సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా తెచ్చుకోవాలని భావిస్తోందా..? సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఈ వార్త హోరెత్తుతోంది. రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు టీ20 ల్లో కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. పైగా టీ20ల్లో నెంబర్ వన్ బ్యాటరైన సూర్యకుమార్ లాంటోడు తమ టీమ్ ను నడిపించాలని ఏ జట్టైనా కోరుకుంటుంది. అందుకే KKR ట్రై చేస్తోందని వార్త. కానీ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడాలి అంటే ఆ పనిని నేరుగా KKR చేసేయలేదు. ఐపీఎల్ 2025కి ముందు మెగా ఆక్షన్ జరగనుంది. అయితే టీమ్స్ తమకున్న ప్లేయర్లలో 4 నుంచి 6 ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. ఇది నాలుగా ఆరా అనే డిస్కషన్ నడుస్తోంది. సో త్వరలో తెలుస్తుంది. బట్ సూర్య కేకేఆర్ కి వెళ్లాలంటే ముందు ముంబై వదిలేయాలి. తర్వాత సూర్య మెగా ఆక్షన్ లో ఉండాలి. అప్పుడు ఏ టీమ్ ఎక్కువ బిడ్ చేసి సూర్యను పాడుకుంటే ఆ టీమ్ కి సూర్యకుమార్ యాదవ్ వెళ్తాడు. సో సూర్యా భాయ్ కావాలంటే ఆక్షన్ లో అందరికంటే ఎక్కువగా ఖర్చుపెట్టి KKR దక్కించుకోవాలి. ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను వదిలేసే సూర్యాభాయ్ కోసం KKR ఇంత చేస్తుందా అంటే డౌటే. చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. వన్స్ మెగా ఆక్షన్ కంప్లీట్ అయితే అప్పుడు IPL 2026 కోసం ట్రేడింగ్ ఆప్షన్ విండో ఉంటుంది. అప్పుడు నేరుగా సూర్యాను ఏ టీమ్ కావాలనుకుంటే ఆ టీమ్ సూర్యను 2025లో కొనుక్కున్న టీమ్ తో కానీ లేదా ముంబైలోనే ఉంటే ముంబైతో కానీ మాట్లాడి నేరుగా కొనుక్కోవచ్చు. బట్ ఈ ఏడాది మాత్రం సూర్యని ఏ టీమ్ అయినా కావాలనుకుంటే ముంబై వదిలేస్తేనే జరుగుతుంది. అప్పుడు కూడా ఆక్షన్ లో పాడుకుని దక్కించుకోవాలి.