Suryakumar Yadav 82 vs Nz Second T20 | టీ20 వరల్డ్ కప్ కి ముందు శుభవార్త | ABP Desam

టీ20 వరల్డ్ కప్ కి ముందు భారత్ కి ఏదైనా శుభవార్త ఉందంటే అది ఇదేనేమో. మాజీ వరల్డ్ నెంబర్ బ్యాటర్, టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చేశాడు. అదేంటీ ఒక్క మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చేశాడని ఎలా చెప్తారు అని మీరు అనుకోవచ్చు...కానీ నిన్న న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో సూర్య అడిన విధానం చెబుతోంది పాత మిస్టర్ 360 కమ్ బ్యాక్ ఇచ్చేశాడని. 209 పరుగుల లక్ష్య చేధనలో 2 పరుగులకే 2 వికెట్లు పడిపోయినా...ఇషాన్ కిషన్ తోడుగా సూర్య కుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. 37 బాల్స్ లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో ఏకంగా 82పరుగులు బాదేసిన సూర్య...221 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 209 టార్గెట్ ని కూడా 15.2 ఓవర్లలోనే భారత్ ఉఫ్ అని ఊదిపారేసింది. ఈ ఇన్నింగ్స్ సూర్యకి ఎందుకింత స్పెషల్ అంటే 23 టీ20 మ్యాచుల తర్వాత ఏడాది కాలం తర్వాత సూర్య కొట్టిన హాఫ్ సెంచరీ ఇది. నేను ఫామ్ లోనే ఉన్నా పరుగులు రావట్లేదంతే అంటూ ఇన్నాళ్లూ తను ఇచ్చుకున్న వింత వింత స్టేట్మెంట్లకు...తను ఫామ్ లో లేకున్నా తనపైనే నమ్మకం ఉంచి వరల్డ్ కప్ కి కెప్టెన్ గా నియమించిన సెలెక్టర్లకు ఇక కవర్ డ్రైవ్ లు వేసుకునే పని భారాన్ని ఒక్క ఇన్నింగ్స్ తో  తప్పించాడు సూర్యా భాయ్

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola