Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర సృష్టించింది. అయితే ఈ టోర్నీలో భారత్ ఎదుర్కొన్న ఏకైక ఓటమి పరాజయం సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ఒక కీలక నిర్ణయం తనను ఇప్పటికీ వెంటాడుతోందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Surya Kumar Yadav ) వెల్లడించారు. అక్షర్ పటేల్‌ను జట్టు నుండి తప్పించడంపై సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను ( Axar Patel )  పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను ( Washington Sundar ) ఆడించడం తన పొరపాటేనని సూర్య అంగీకరించారు. "నా నిర్ణయంతో అక్షర్ చాలా ఆగ్రహానికి గురయ్యాడు. అతను ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు, కోపం రావడం సహజం. అందుకే నేను స్వయంగా అతనికి క్షమాపణలు చెప్పాను. టీమ్ ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అది తప్పని తర్వాత అర్థమైంది" అని సూర్య వివరించారు. 

అంతేకాకుండా, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కూడా సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ద్వైపాక్షిక సిరీస్‌లలో 100 విజయాలు సాధించినా ప్రజలు మర్చిపోతారు, కానీ ప్రపంచకప్ విజయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు" అని గంభీర్ జట్టులో స్ఫూర్తి నింపారట. ఫైనల్ గెలిచిన తర్వాత గంభీర్ ముఖంలో అతిపెద్ద నవ్వు చూశామని సూర్య గుర్తు చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola