Sunil Gavaskar vs Nasser Hussain | ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌కు గవాస్కర్ కౌంటర్ | ABP Desam
అంతర్జాతీయ క్రికెట్‌లో బీసీసీఐ ఆధిపత్యంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ( Nazar Hussain ) చేసిన విమర్శలకు టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. బీసీసీఐ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతర దేశాలను బెదిరిస్తోందని నాజర్ చేసిన ఆరోపణలను గవాస్కర్ ( Sunil Gavaskar ) తీవ్రంగా ఖండించారు.
"భారత్ క్రికెట్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదగడాన్ని పాత ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే భారత్ ఏం చేసినా తప్పులు వెతుకుతూ ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారు. అని గవాస్కర్ పేర్కొన్నారు.
బీసీసీఐ ఇతర దేశాలను బెదిరిస్తోందన్న ఆరోపణలపై గవాస్కర్ 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) ప్రదర్శనను ఉదాహరణగా చూపారు. "నిజమైన బెదిరింపు అంటే ఏమిటో తెలుసా? అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ( Under-19 World Cup final ) ఇంగ్లండ్ బౌలర్లను ధ్వంసం చేస్తూ వైభవ్ 80 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. అది అసలైన ఆధిపత్యం. భారత్ చేస్తున్న పనులను బెదిరింపులుగా చూడడం మానుకోండి" అని గవాస్కర్ స్పష్టం చేశారు.























