Srilanka vs India 2nd ODI Preview | మొదటి వన్డే స్ఫూర్తితో రెచ్చిపోయేందుకు సిద్ధంగా లంక | ABP Desam
ఫస్ట్ వన్డేలో చూశాం. 14 బంతుల్లో 1 పరుగు కొట్టాలంటే ఇండియాను కొట్టనివ్వకుండా అడ్డుకుంది శ్రీలంక. ఇది ఆ యువ జట్టుకు చాలా స్ఫూర్తినిచ్చే అంశం. తమ స్పిన్ ఉచ్చులో భారత్ లాంటి టాప్ జట్టును విలవిలలాడించామని ఆత్మవిశ్వాసం ఉండి ఉంటుంది లంక జట్టు. అలాంటి శ్రీలంకతో నేడు భారత్ రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్ అనుకోకుండా టై కావటంతో ఈసారి ఎలాగైనా విరుచుకపడాలని టీమిండియానూ భావిస్తూ ఉండి ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే శ్రీలంక అయితే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అదరగొట్టిన దునిత్ వెల్లలగే తో పాటు రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అదరగొట్టిన కెప్టెన్ అసలంక స్పిన్ ను ఎదుర్కోవటమే మనకు కీలకం. శ్రీలంక కీ స్పిన్నర్ హసరంగా గాయపడ్డాడు అంటున్నారు మరి మ్యాచ్ ఆడతాడో లేదో చూడాలి. బ్యాటింగ్ లో లంక ఓపెనర్లు ఇస్తున్న మంచి ఆరంభాన్ని మిగిలిన బ్యాటర్లు కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటుంది. భారత్ విషయానికి వస్తే అదే స్పిన్ పిచ్ లపై అక్షర్ పటేల్, కుల్దీప్, సుందర్ బాగానే బౌలింగ్ చేశారు. పరుగులైతే ఆపగలిగారు కానీ వికెట్లు ఎక్కువగా రాలేదు. పరాగ్ కూడా స్పిన్ బౌలింగ వేయగలడు కాబట్టి రోహిత్ ఏం చేస్తాడో చూడాలి. ఇక బ్యాటింగ్ లో రోహిత్ శర్మ మొదటి వన్డేలో చూపించిన దూకుడును మిగిలిన బ్యాటర్లు చూపించలేకపోయారు. అందరూ 30లు కొట్టి ఫర్వాలేదు అనిపించినా 231 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయటానికి మనవాళ్లకు శక్తి సరిపోలేదన్న విషయం ఇక్కడ గమనించాలి. మరి సిరీస్ ను గెలుచుకోవాలంటే మిగిలి ఉన్న రెండు వన్డేలు గెలవాలి కాబట్టి లంక స్పిన్నును టీమిండియా బ్యాటర్లు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.