Srilanka vs India 1st ODI Preview | నేటి నుంచి లంకతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్ | ABP Desam

 శ్రీలంకతో టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఈ రోజు అదే లంకతో వన్డే సిరీస్ కు సిద్ధమైపోతోంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఫస్ట్ వన్డే ఈరోజు ఆడనుంది భారత్. అయితే ఈ వన్డే సిరీస్ కోసం సీనియర్లంతా తిరిగి వచ్చేయటంతో టీమ్ సెలక్షన్ మేనేజ్మెంట్ కి తలనొప్పిగా మారింది. 2023 లో వరల్డ్ కప్ ఫైనల్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఆడుతున్న వన్డే మ్యాచ్ లు ఇవే కావటంతో టీమ్ సెలక్షన్ కోసం చాలా తిప్పలు పడాల్సి వస్తోంది. ఇదివరకటి లానే రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా వస్తారు. వన్ డౌన్ కొహ్లీ, టూ డౌన్ లో శ్రేయస్ అయ్యర్ ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది. కానీ వికెట్ కీపర్ ఎవరు అనే టెన్షన్ అంతా. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లో ఎవరిని తీసుకోవాలనే తలనొప్పి అటు కోచ్ గంభీర్ కి, ఇటు కెప్టెన్ రోహిత్ శర్మకు ఏర్పడింది. పోనీ ఇద్దరినీ తీసుకోవాలంటే ఓ బౌలర్ ను తగ్గించుకోవాలనేది మరో సమస్య. సో పంత్, రాహుల్ లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. సిక్స్త్ పొజిషన్ కోసం రియాన్ పరాగ్, శివమ్ దూబే పోటీ పడుతున్నారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఉండనుండగా...సిరాజ్, అర్ష్ దీప్ తో పాటు మూడో పేసర్ గా హర్షిత్ రానాను తీసుకోవాలా లేదా ఖలీల్ అహ్మద్ కి ఛాన్స్ ఇవ్వాలా అని టీమిండియా ఆలోచిస్తోంది. మరో టీమిండియా చేతిలో టీ20 సిరీస్ ఓడిపోయిన లంక...వన్డే సిరీస్ లో ఎలా అయినా బదులు తీర్చుకోవాలనే కసితో ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola