South Africa vs India T20 World Cup Final | ప్రపంచకప్ తుది సమరానికి భారత్, దక్షిణాఫ్రికా సిద్ధం |ABP
కరీబియన్ గడ్డపై భారత్ జెండా...విశ్వవిజేతలుగా రోహిత్ సైన్యం. ఇదే ఈ రోజు అందరూ వినాలకుంటున్న చూడాలంటుకున్న విషయం. ఈ వరల్డ్ కప్ లో అప్రతిహత జైత్రయాత్రతో ఫైనల్ వరకూ దూసుకొచ్చిన టీమిండియా..విశ్వవిజేతగా మారేందుకు ఇక ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. బలమైన సౌతాఫ్రికాను అంతకంటే బలంగా ఢీకొడితే చాలు 13సంవత్సరాల తర్వాత భారత్ చేతిలోకి ప్రపంచకప్ వచ్చి చేరుతుంది. 2007లోనే టీ20 వరల్డ్ కప్ ను మనం సాధించినా..2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్ మరో వరల్డ్ కప్ ను అందుకోలేక పోయింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వరకూ దూసుకెళ్లినా ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయి ఆసీస్ కు ట్రోఫీని కోల్పోయింది. కానీ ఈసారి మాత్రం అలా కాకూడదని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. సౌతాఫ్రికా వరుస విజయాలతోనే ఇక్కడిదాకా దూసుకువచ్చిన మునుపటంత బలంగా సఫారీ జట్టు కనిపించటం లేదు. డికాక్ ఆడటం మినహా మరో బ్యాటర్ పెద్దగా రెచ్చిపోయింది లేదు. ప్రధానంగా క్లాసెన్ లాంటి వీరబాదుడు బాదే హిట్టర్ అంత టచ్ లో లేకపోవటం మనకు కలిసొచ్చే అంశం. మన స్పిన్నర్లు, మన పేసర్లు బార్బడోస్ లో మరోసారి రెచ్చిపోతే చాలు. ఇక బ్యాటింగ్ విషయంలో మరోసారి రోహిత్ శర్మనే ఆదుకోవాలి. దానికి తోడుగా కింగ్ రెచ్చిపోతే ప్రొటీస్ కు చుక్కలు కనిపించటం ఖాయం. టాపార్డర్ లో పంత్, సూర్య...మిడిల్ ఆర్డలో పాండ్యా తమ ఫామ్ ను కొనసాగిస్తే చాలు. అయితే దూబేనే ఉంటాడా ఎవరూ ఊహించని విధంగా సంజూనూ ఏమన్నా ట్రై చేస్తారా చూడాలి. మొత్తంగా ఈ ఒక్క మ్యాచ్ భారత్ తన ఆధిపత్యం ప్రదర్శిస్తే చాలు ప్రపంచకప్ భారత్ చేతిలోకి వచ్చేస్తుంది. టీమిండియా విశ్వవిజేతలుగా నిలుస్తుంది.