Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam

Continues below advertisement

ముందు సీన్ 1. మాములుగా ఓ బ్యాటర్ ఒక ఓవర్ లో 32 పరుగులు కొడితే చాలా పెద్ద స్కోరు కదా. ఒకే ఓవర్ లో వరుసగా 4,4,6,6,6,6 అంటూ ఆ బౌలర్ ను ఉతికి ఆరేస్తే..ఆ బ్యాటర్ ను డేంజరస్ బ్యాటర్ అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు రెండో సీన్. ఆఖరి ఓవర్ ప్రత్యర్థి టీమ్ గెలవాలంటే లాస్ట్ ఓవర్ లో 7 పరుగులు చేస్తే చాలు. టీ20 ఫార్మాట్ లో ఆఖరి ఓవర్ లో అసలు అది లక్ష్యమే కాదు. కానీ అంత చిన్న టార్గెట్ ను కాపాడుకోవటంతో పాటు కేవలం 2 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయటంతో పాటు మ్యాచ్ ను ఓ బౌలర్ గెలిపిస్తే అది పెద్ద అఛీవ్మెంట్ కదా. ఇలా బ్యాటింగ్ లో బౌలింగ్ లో రెండు అఛీవ్మెంట్లు ఒకే మ్యాచ్ లో చేసి చూపించింది సోఫీ డివైన్. ఆదివారం డబ్యూపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ విమెన్ కి గుజరాత్ జెయింట్స్ విమెన్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ ను రిప్రజెంట్ చేస్తున్న కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ ఈ అరుదైన ఫీట్ ను నిజం చేసి చూపించింది. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ సోఫీ డివైన్ బాదిన బాదుడుకు ఏకంగా 209 పరుగుల భారీ స్కోరు చేసింది. సోఫీ 42 బాల్స్ లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో 95పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్ స్నేహ్ రాణా వేసిన ఓవర్ లో అయితే 32 రన్స్ లాగేసింది సోఫీ. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో స్నేహ్ రానాకు చుక్కలు చూపించింది. 210 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయటంలో ఢిల్లీ బ్యాటర్లు ధాటిగా ఆడినా లాస్ట్ ఓవర్లో 7 పరుగులు చేస్తే చాలు ఢిల్లీ దే మ్యాచ్ అనుకుంటున్న టైమ్ లో తనలోని ఆల్ రౌండర్ ఎబిలిటీని బయటకు తీసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి జెమీ, వోల్వార్డ్ ను ఔట్ చేసి గుజరాత్ కు అనూహ్య విజయాన్ని అందించింది సోఫీ డివైన్.  న్యూజిలాండ్ తరపున క్రికెట్, హాకీ రెండు అంతర్జాతీయ జట్లకు ఆడుతుండటం సోఫీ డివైన్ మాత్రమే అఛీవ్ చేసిన మరో రికార్డ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola