Smriti Mandhana Records | India vs Australia | స్మృతి మంధానా ఫాస్టెస్ట్ రికార్డ్ | ABP Desam
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 5,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమిండియా బ్యాటర్‌గా స్మృతి మంధానా రికార్డు బ్రేక్ చేసింది. వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధానా 80 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ , వివియన్ రిచర్డ్స్ వన్డే క్రికెట్‌లో 5,000 పరుగులు చేయడానికి 114 ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే స్మృతి మంధానా వన్డే కెరీర్‌లో 112వ ఇన్నింగ్స్‌లో 5 వేల పరుగులు పూర్తి చేసింది. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ స్టెఫానీ టేలర్ పేరిట ఉంది, ఆమె 129 ఇన్నింగ్స్‌లలో ఐదు వేల పరుగుల మార్క్ చేరుకుంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1,000 ODI పరుగులు చేసిన ప్రపంచంలోని మొదటి మహిళా క్రికెటర్ స్మృతి మంధానా. మంధానా ఈ ఏడాది వన్డేల్లో 4 సెంచరీలు చేసింది. ఈ క్రమంలో 2025లో అత్యధిక వన్డే పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది డ్యాషింగ్ బ్యాటర్ స్మృతి మంధానా.