Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam

Continues below advertisement

  40 ఏళ్ల తర్వాత తీరిన కల.. ప్రపంచకప్‌ను గెలిచిన.. సంబరాల్లో మునిగిపోతున్న సందర్భం.. అంతటి ఉద్విఘ్న క్షణాల్లోనూ మన అమ్మాయిలు ప్రత్యర్థులను ఓదార్చారు. విజయం అంటే విజయం అంటే కేవలం ట్రోఫీ లిఫ్ట్ చేయడం కాదు బాస్... హృదయాలను గెలవడమే అసలు గేమ్! అని నిరూపించారు. దక్షిణాఫ్రికా చివరి వికెట్‌ నేలకూలిన ఆ క్షణం భారతావని మొత్తం మారుమోగిపోయింది. వేలాది మంది ప్రత్యక్షంగా కోట్లాది మంది టీవీలు, మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మైదానంలో ఉన్న వారి పరిస్థితి చెప్పేదేమంది. వాళ్లంతా ఓ ట్రాన్స్‌లో ఉన్నారు. ఇన్నాళ్ల తమ కష్టం ఫలించిందన్న అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంతటి ఉద్విఘ్న క్షణాల్లోనూ.. మన ప్లేయర్‌లు.. Smriti Mandhana, Jemimah Rodrigues, Deepthi Sharma ప్రత్యర్థి ప్లేయర్ల దగ్గరకు వెళ్లారు. ఓటమి బాధలో ఉన్న వాళ్లని ఓదార్చారు. దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఎవరో విన్నర్‌-లూజర్‌లు కాదు, మనమంతా ప్లేయర్స్ అని గుర్తు చేసిన క్షణం అది.. ఈ దృశ్యాలను కెమెరామెన్లు బంధించగా..ICC తన సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో పెట్టింది. మ్యాచ్ తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ Laura wolvaardt కూడా ఎమోషనల్‌గా స్పందించింది “ఇండియా deserved this win" అని చెప్పింది. అమ్మాయిల ఆట అంటే ఎవ్వరూ పట్టించుకోని రోజుల నుంచి నేడు విశ్వవిజేతగా నిలిచే వరకూ ఇండియన్ విమెన్‌ టీమ్స్‌ అనేక అవరోధాలను దాటుకుంటూ వచ్చాయి. రెండు సార్లు ఫైనల్‌కు చేరినా గెలవలేకపోయినా ఈ సారి మాత్రం వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిలు...గేమ్ బయట ప్రత్యర్థులను ఓదార్చి..ఆటకు అసలైన అర్థం చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola