Skirt Changed Cricket | వరల్డ్ క్రికెట్లో అదో విప్లవం | ABP desam
బుమ్రా యార్కర్లతో అదరగొట్టినా.. స్టార్క్ బౌన్సర్లతో బ్యాటర్లని భయపెట్టినా.. రషీద్ ఖాన్ తన లెగ్ స్పిన్‌తో అపోనెంట్‌కి చెమటలు పట్టించినా.. వీళ్లందరి సక్సెస్ వెనక ఓ అమ్మాయి ఉందంటే నమ్ముతారా..? ఆమెకొచ్చిన చిన్న ప్రాబ్లమ్ అండ్ దానికి ఆమె కనుక్కున్న ఓ గొప్ప ఇన్నోవేషన్ ప్రపంచ క్రికెట్‌నే మార్చేసిందంటే ఒప్పుకుంటారా..? కానీ ఇది నిజం. క్రికెట్లో బౌలింగ్ అంటే మనకు తెలిసింది.. 140-150 స్పీడ్ తో బుల్లెట్లా దూసుకొచ్చే యార్కర్లు, బౌన్సర్లు.. గింగిరాలు తిరుగుతూ బ్యాటర్ ని టెన్షన్ పెట్టే దూస్రాలు, తీస్రాలు మాత్రమే. ఇవన్నీ క్రికెట్‌లో ఇప్పుడు చాలా కామన్. కానీ ఒకప్పుడు, క్రికెట్‌లో ఓన్లీ ఒకే రకమైన బౌలింగ్ ఉండేది. అదే అండర్-ఆర్మ్ బౌలింగ్. అంటే బంతిని కింద నుంచి విసిరేవాళ్లు.ఈ స్టోరీ 18th century టైమ్ లోది. అప్పట్లో బౌలర్స్ అండర్ ఆర్మ్ త్రోతో బౌలింగ్ చేస్తే.. బంతి దొర్లుకుంటూ బ్యాటర్ దగ్గరకి వస్తే.. బ్యాట్ తో ఆ బంతిని బలంగా కొట్టేవాళ్ళు. ఆ తర్వాత బంతిని కంప్లీట్ గా దోర్లించకుండా కొద్దిగా స్టెప్ పడేలా వేసేవాల్లు. అది కూడా అండర్ ఆర్మ్ త్రోనే. కానీ స్కాట్లాండ్‌లోని ఒక చిన్న క్లబ్‌లో జరిగిన ఓ మాచ్ మొత్తం క్రికెట్ హిస్టరీని మార్చేసింది.