Shubman Gill India Captain Three Formats | శుభ్ మన్ గిల్ శకం కోసం గంభీర్ కసరత్తులు | ABP Desam
కాగల కార్యం గంధుర్వలే తీర్చినట్లు...శుభ్ మన్ గిల్ శకం ఆరంభానికి కట్టప్పలా తెగ కష్టపడుతున్నాడు కోచ్ గంభీర్. స్టార్ కల్చర్ అంటే కంపరం చూపించే గంభీర్ చాలా సీరియస్ గా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లాంటి స్టార్స్ కెరీర్ ముగించే పనిలో పడ్డాడని టీమ్ సెలెక్షన్స్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. 34ఏళ్ల సూర్య, 36ఏళ్ల కింగ్ కొహ్లీ, 38ఏళ్ల రోహిత్ శర్మ ఇలా ఫామ్ తో సంబంధం లేకుండా అందరి వయస్సుతోనే గంభీర్ కు ఇబ్బంది. ఏళ్లుగా డ్రెస్సింగ్ రూమ్ ను అంటిపెట్టుుకని మిగిలిన యంగ్ క్రికెటర్లకు దేశం తరపున ఆడే ఛాన్స్ లేకుండా చేస్తున్నారనే ఆలోచనల్లో ఉన్న గంభీర్...పాతికేళ్ల శుభ్ మన్ గిల్ ను ఆల్ ఫార్మాట్స్ కు కెప్టెన్ చేస్తే మరో ఐదారేళ్లు అతని సారథ్యంలోనే టీమిండియా యంగ్ బ్లడ్ తో నడవాలి అనేది ప్లాన్. అందుకే టీ20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కు ఆసియా కప్ అగ్ని పరీక్ష అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్, కొహ్లీలు పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. తర్వాత పాండ్యాను కాదని జట్టు పగ్గాలు అందుకున్న సూర్య నాలుగు సిరీస్ ల్లో టీమిండియాను గెలిపించినా కూడా ఆసియా కప్ లో నెగటివ్ ఫలితం వస్తే సూర్య కెప్టెన్సీ ఊస్టింగ్ అవ్వటం పక్కా. 34ఏళ్ల వయస్సు..బ్యాటింగ్ లో ఫామ్ లో లేకపోవటం కూడా అతనికి స్థానానికి ఎసరు పెట్టొచ్చు. అటు వన్డేల్లో రోహిత్ శర్మనే ఇప్పటికీ కెప్టెన్ అయినా తనను 2027 వన్డే వరల్డ్ కప్ టైమ్ వరకూ కొనసాగించాలన గంభీర్ భావించట్లేదని అర్థం అవుతోంది. అందుకే నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ అటూ ఇటూ అయితే ఇప్పుడే ఆడలేనోడివి 40ఏళ్లు వచ్చాక వరల్డ్ కప్ ఏం ఆడతావ్ అని పక్కాగా తప్పించే ప్రయత్నాలు మొదలౌతాయి. ఏది ఏమైనా ఏం జరుగుతున్నా అదంతా మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను చేయాలని గంభీర్ లక్ష్యం దిశగానే జరుగుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.