Shubman Gill Double Century vs Eng 2nd Test | డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన కెప్టెన్ గిల్ | ABP Desam
ఇంగ్లండ్ లో టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన భారత తొలి కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో దుమ్ము రేపిన గిల్ 311 బంతుల్లో 21 ఫోర్లు 2సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదేశాడు. కెప్టెన్ గా ఆడిన మొదటి టెస్టు లీడ్స్ లో సెంచరీ కొట్టిన గిల్, రెండో టెస్టు ఎడ్జ్ బాస్టన్ లో డబుల్ సెంచరీ కొట్టి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ కెప్టెన్ గా నిలిచాడు. అంతే కాదు SENA కంట్రీస్ గా పిలుచుకునే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఆ జట్లపై వాళ్ల హోం పిచ్ ల మీద ఇప్పటివరకూ ఏ ఆసియా కెప్టెన్ కూడా డబుల్ సెంచరీ సాధించలేదు. ఆ ఘనతను కూడా ప్రిన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ముందు జడేజా తోడుగా తర్వాత సుందర్ తోడుగా భారత్ ను భారీ స్కోరుగా నడిపిస్తున్న గిల్ ఇప్పటికే భారత్ ను పటిష్ఠ స్థితికి చేర్చాడు. తర్వాత భారత బౌలర్లు ఎలా రాణిస్తారనే దానిపై ఈ టెస్టులో మన విజయవకాశాలు ఆధారపడనున్నాయి