Shivam Dube in Asia CUp 2025 | సమస్యగా మరీనా శివమ్ దూబే | ABP Desam
ఆసియా కప్‌లో టీం ఇండియా ఎలాగైనా గెలవాలని చూస్తుంది. ప్లేయర్స్ అంతా గ్రౌండ్ లో కష్టపడుతున్నారు. అయితే ఒక ప్లేయర్ మాత్రం టీం లో కాస్త సమస్యగా మారే ఛాన్స్ ఉంది. అతనే శివమ్ దూబే. అల్ రౌండర్ గా మంచి పేరు తెచ్చుకున్న దూబే.. గత కొన్ని సిరీస్ లో పెద్దగా రాణించలేకపొయ్యాడు. ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఆశించిన స్థాయిలో తన ప్రదర్శన ఉండట్లేదు. 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 10 పరుగులు, బంగ్లాదేశ్‌పై 34 పరుగులు, ఆస్ట్రేలియాపై 28 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌పై డక్ అవుట్ అయ్యాడు. లాస్ట్ 10 ఇన్నింగ్స్ చూస్తే ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆసియా కప్ లో కోచ్ గంబీర్ మరోసారి దూబే కు ఛాన్స్ ఇచ్చారు. ఆసియా కప్ లో తన ప్రదర్శన మార్చుకుంటాడా లేదా ఇలానే కంటిన్యూ చేస్తాడా అన్నది చూడాలి. సమస్యగా మారిన ఇండియా ఆల్ రౌండర్ అంటూ ఇప్పుడూ దూబేపైనే అందరి చూపూ ఉంది.