Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని టీమిండియాలోకి తీసుకోకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చాలా సీరియస్ అయ్యారు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా.. రంజీ ట్రోఫీలో 2 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్ ప్రదర్శిస్తున్నా.. 3 ఫార్మాట్లలోనూ ఆడే స్టామినా ఉన్న ఆటగాడని తెలిసినా కూడా షమిని టీమిండియాలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో టెస్ట్ టీమ్ సిరీస్‌కి ఎందుకు సెలక్ట్ చేయలేదని నిలదీశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన మహమ్మద్ షమీ.. ఫిట్‌నెస్ సమస్యలతో భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించి దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటినా.. సెలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. సెలెక్టర్ల తీరుపై మహమ్మద్ షమీ కూడా ఈ మధ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక రీసెంట్‌గా సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఆడబోయే టీమిండియాకి కూడా షమిని సెలక్ట్ చేయలేదు. ఇలాంటి టైంలో ఓ టీవీ షోలో మాట్లాడిన గంగూలీ.. సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. రంజీ ట్రోఫీలో మహమ్మద్ షమీ బౌలింగ్ చూశాను. అతను ఫిట్‌గా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒంటి చేత్తో బెంగాల్‌ను గెలిపించాడు. రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అతని ప్రదర్శనను సెలెక్టర్లు చూశారనే అనుకుంటున్నా. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్, ఫిట్‌నెస్ చూస్తే భారత్‌కు అన్ని ఫార్మాట్లలో ఆడగలడు. ముఖ్యంగా షమీని టెస్ట్‌ల్లో ఎందుకు తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు.’ అంటూ గంగూలీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి గంగూలీ సజెషన్‌ని టీమిండియా సెలక్షన్ కమిటీ ఎలా తీసుకుంటుందో చూడాలి.