Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam

Continues below advertisement

 నిన్న మొన్నటి వరకూ ఫామ్ లేక తంటాలు పడి..అసలు ఫైనల్ 11 లో చోటే కోల్పోయిన భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ కీలక మ్యాచుల్లో విజృంభించి ఒక్కసారిగా ఈ వరల్డ్ కప్ లో హీరోగా మారిపోయాడు. వెస్టిండిస్ మీద క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచులో ఛేజింగ్ లో కొట్టిన 97పరుగుల నాటౌట్ స్కోరు...సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ మీద పవర్ ప్లేలో రఫ్పాడిస్తూ కొట్టిన 89 పరుగుల ఇన్నింగ్స్ లు సంజూ పేరును దేశవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఫైనల్లోనూ సంజూ అలాంటి ఇన్నింగ్సే ఇంకోటి ఆడేస్తే చరిత్రలో వరల్డ్ కప్ హీరోగా మిగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి శాంసన్ చెలరేగాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. అయితే తను ఆడిన రెండు ఇన్నింగ్స్ లను సెంచరీలుగా మలుచలేకపోవటం బాధగా ఉందా అంటూ ఓ మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు సంజూ సమాధానం చెప్పాడు. సెంచరీల గురించి పక్కన పెడితే తన కెరీర్ లో ఈ రెండు స్కోర్లు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు సంజూ శాంసన్. మ్యాచ్ ను గెలిపించటానికి అవసరమైన ఆ స్కోర్లు సెంచరీల కంటే ఎక్కువ అన్నట్లు బదులిచ్చిన సంజూ శాంసన్...పైగా తను ఎలాంటి ఫామ్ లో ఉన్నప్పుడు ఆ స్కోర్స్ వచ్చాయో మిగిలిన వాళ్లందరికీ తెలుసంటూ నవ్వేశాడు. పైగా ఎప్పుడూ దురదృష్టమే తిరిగే తన చుట్టూ అప్పుడు అప్పుడప్పుడూ అదృష్టం కూడా ఉంటుందని అందుకే హ్యారీ బ్రూక్ తన క్యాచ్ ను వదిలేశాడంటూ ఫన్ క్రియేట్ చేశాడు.  ఇదే ప్రెస్ మీట్ లో అభిషేక్ శర్మను వెనకేసుకొచ్చాడు సంజూ శాంసన్. అభిషేక్ ఎలాంటి ఆటగాడో ఎవరూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్న సంజూ...తను కుదురుకోవటానికి ఒక్క ఇన్నింగ్స్ చాలని..అది ఫైనల్ కావాలని ఫ్యాన్స్ అంతా కోరుకోవాలంటూ యంగ్ స్టర్ కు బ్యాకింగ్ ఇచ్చాడు సంజూ భాయ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola