Sanju Samson consecutive ducks | SL vs IND సిరీస్ లో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే | ABP Desam
సంజూ శాంసన్. అద్భుతమైన ఆటగాడు..అద్భుతమైన కెప్టెన్ కూడా. మనం చూస్తున్నాం రాజస్థాన్ రాయల్స్ ను ఏళ్లుగా సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. యశస్వి జైశ్వాల్ లాంటి యంగ్ స్టర్స్ ను జోస్ బట్లర్ లాంటి సీనియర్లను కలిపి నడిపించగల సమర్థుడు. అలాంటి శాంసన్ టీమిండియా తరపున ఆడటంలో ఎందుకో దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూస్తాడు. తీరా ఆ ఛాన్స్ వస్తుంది. అప్పుడే ఇదిగో ఇలా బాతు గుడ్లు పెడుతూ ఉంటారు. మా వాడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండిరా అని సంజూ ఫ్యాన్స్ మళ్లీ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. కానీ ఈసారి శ్రీలంక తో టీ20 సిరీస్ సంజూ శాంసన్ బ్యాడ్ లక్ కంటే స్వయంకృతాపరాధం అని చెప్పాలి. ఎందుకంటే మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో అసలు ఫస్ట్ సంజూను తీసుకోలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ కావటంతో ఫస్ట్ ఛాయిస్ కీపర్ గా పంత్ నే ఎంచుకున్నారు. మా సంజూనే ఎన్నిసార్లు పక్కనపెడతారు అంటూ ఫ్యాన్స్ మళ్లీ ఏడుపు మొదలుపెట్టారు. వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు ఆడనివ్వలేదు..ఇప్పుడు ఈ బచ్చా సిరీస్ లో కూడా ఆడనివ్వకుండా మా వాడిని తొక్కేస్తున్నారంటూ ఒకటే పెడబొబ్బలు. సరే రెండో టీ20 మ్యాచ్ లో అవకాశం వచ్చింది. గిల్ మెడ పట్టేయటంతో అనూహ్యంగా టీమ్ లోకి వచ్చాడు సంజూ భాయ్. 8ఓవర్లే మ్యాచ్. మతీషా పతిరానా బౌలింగ్ . ఐపీఎల్ లో అతన్ని బాగానే ఆడిన సంజూ రెండో టీ20 మ్యాచులో మొదటి బంతికే క్లీన్ బౌల్డ్. సర్లే ఒక్క మ్యాచే కదా అది కూడా ఫుల్ మ్యాచ్ కాదు. మళ్లీ ఎప్పుడు వస్తుందో అవకాశం అనుకున్నారు అంతా. ఆశ్చర్యకరంగా సూర్య కుమార్ యాదవ్, అండ్ గంభీర్ కలిసి మళ్లీ మూడో టీ20 మ్యాచులోనూ అవకాశం ఇచ్చారు. ఈసారి గిల్ తిరిగివచ్చినా కూడా శాంసన్ ను నిన్న మ్యాచ్ లో కొనసాగించారు. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేయటంతో భారత్ టాపార్డర్ కుప్పకూలింది. సంజూ శాంసన్ కు హీరో అయిపోయే అవకాశం. కావాల్సినంత సేపు ఆడుకునే ఛాన్స్. తనెంత క్యాపబుల్ ప్లేయరో ప్రూవ్ చేసుకునేంత స్టేజ్. సంజూ ఏం చేశాడో తెలుసా మళ్లీ డకౌట్ అయ్యాడు. అది కూడా చెత్త షాట్ ఆడి. ఇదైతే క్షమించరాని నేరం అంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఛాన్స్ ల కోసం అన్నిసార్లు వేచి చూసే సంజూ శాంసన్ ఇలా అవకాశం వచ్చినప్పుడు బాధ్యతగా ఆడకపోతే ఎలా అంటూ మీమ్స్ అండ్ ట్రోల్స్ తో ఏకేస్తున్నారు. లంకతో వన్డే సిరీస్ లో సంజూ లేడు. సో మళ్లీ టీ20 సిరీస్ లో శాంసన్ కు చోటు ఉంటుందో లేదా 29ఏళ్ల ఈ బ్యాటర్ ను ఇక నమ్ముకోవటం అనవసరం లే అని యంగ్ స్టర్స్ కి ఛాన్స్ ఇస్తారో చూడాలి.