Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam

Continues below advertisement

 దురదృష్టం వెంటాడి రనౌట్ అయ్యేవాళ్లు ఉంటారు. మబ్బు గాళ్లలా ఆడదామనుకుని రనౌట్ అయ్యేవాళ్లు ఉంటారు. బెస్ట్ ఉదాహరణ పాకిస్తాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా నిన్న రనౌట్ అయిన విధానం.  పాకిస్తాన్ కు, బంగ్లా దేశ్ కు మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో రెండో వన్డే ఢాకాలో జరిగింది. మొదట పాకిస్తాన్ బ్యాటింగ్ చేయగా...39 ఓవర్ ను బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ వేశాడు. స్ట్రైకింగ్ మహ్మద్ రిజ్వాన్ ఉండగా..నాన్ స్ట్రైకింగ్ లో సల్మాన్ అఘా ఉన్నాడు. రిజ్వాన్ కొట్టిన బంతి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు దూసుకు రాగా..రన్ కోసం క్రీజు వదిలిన అఘా, బంతి కోసం ట్రై చేసిన మిరాజ్ ఇద్దరూ ఒకే టైమ్ లో ఢీకొట్టుకున్నారు. అయితే తన కాళ్ల మధ్యలో ఆగిన బంతిని మిరాజ్ కి ఇద్దామని సల్మాన్ అఘా ట్రై చేయగా...బంతిని లాక్కున్న మిరాజ్ తన వెనుక ఉన్న వికెట్లను కొట్టి రనౌట్ అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ పరిశీలించి రూల్స్ ప్రకారం సల్మాన్ అఘాను ఔట్ గా ప్రకటించాడు. అయితే తను బంతిని బౌలర్ కి ఇవ్వాలని ముందుకు వెళ్లాలని అది ఎలా ఔట్ అవుతుందని సల్మాన్ అఘా అంపైర్లతో వాదించి చివరకు చేసేది లేక బంగ్లా బౌలర్ ను బూతులు తిట్టుకుంటూ అసహనంతో డగౌట్ వైపు వెళ్లాడు. బౌలర్ మిరాజ్ మాత్రం బంతి డెడ్ కాలేదు కాబట్టి తను వికెట్లను గిరాటేసి ఔట్ అప్పీల్ చేశానని చెప్పాడు. వాస్తవానికి రూల్స్ ప్రకారం మిరాజ్ చేసింది కరెక్టే..స్పోర్ట్స్ మన్ షిప్ గురించి కొంత మంది మాట్లాడొచ్చు కానీ ఏ ఉద్దేశంతో అఘా క్రీజును వదిలాడు. రన్ కోసమే కదా. అది రాదు అని అర్థమైనప్పుడు వెనక్కి రావాలి కానీ పిచ్ మీదకు వెళ్లి బాల్ బౌలర్ కి ఇద్దామకున్నాను చెప్పటం కేవలం కవరింగ్ మాత్రమేనంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మొత్తం గా పాకిస్తాన్ క్రికెటర్లు తమకు మాత్రమే అలవాటైన రీతిలో మరోసారి మబ్బు మొహంలా ఔట్ అవ్వటం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola