Sachin Son Arjun Tendulkar Wedding | మోదీని కలిసిన సచిన్ కుటుంబం | ABP Desam

Continues below advertisement

భారత క్రికెట్ ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) తన ఇంట జరగబోయే శుభకార్యానికి సంబంధించిన వార్తను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ( Arjun Tendulkar ) వివాహానికి రావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ( Arjun Tendulkar weds Sania Chandok ) వివాహం మార్చి 5న ముంబైలో అట్టహాసంగా జరగనుంది. సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. గత కొంతకాలంగా అర్జున్, సానియా స్నేహంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.

సచిన్, మోదీతో ( Prime Minister Modi ) కలిసి దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి ముర్ము ( President Murmu ), రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), అమిత్ షా ( Amit Shah ) ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ముంబైలో జరగబోయే ఈ వివాహ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola