SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam

Continues below advertisement

 ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. న్యూజిలాండ్ ఈ స్థాయిలో చెలరేగిపోతుంది అని. లీగ్ దశ అంతెందుకు సూపర్ 8లోనూ పడుతూ లేస్తూ విజయాలు సాధించి సెమీస్ కు వచ్చిన న్యూజిలాండ్...సెమీస్ లో మాత్రం వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవాలని అనుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ప్రతీ విభాగంలోనూ ఆ కసిని చూపించిన కివీస్...సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కి దూసుకువెళ్లింది. టాస్ గెలిచి ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించిన న్యూజిలాండ్ తమ డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసింది. 12 పరుగులకే ఓపెనర్లు డికాక్, ర్యాన్ రికెల్టన్ ల వికెట్లు తీసేసి గేమ్ లోకి దూసుకొచ్చిన న్యూజిలాండ్..తర్వాత ఏ దశలోనూ సఫారీలను కుదురుకోనివ్వలేదు. కేవలం చివర్లో ఆల్ రౌండర్ మార్కో యాన్సెన్ మాత్రమే అడ్డుపడి హాఫ్ సెంచరీ కొట్టడంతో సఫారీలు 170 పరుగుల టార్గెట్ ను కివీస్ ముందు ఉంచగలిగారు. ఇంత కష్టపడి సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది కదా అంతగా ఫామ్ లో లేని న్యూజిలాండ్ కి కష్టమేమో అనుకుంటే తప్పని నిరూపించారు ఓపెనర్లు సీఫర్ట్, ఫిన్ అలెన్. టోర్నీ అంతా ఫామ్ చూపించిన సీఫర్ట్ మరోసారి 58 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభం ఇస్తే...టోర్నీ అంతా విఫలమైన ఫిన్ అలెన్ కీలక సమయంలో క్లచ్ వేసి దుమ్మురేపాడు. అట్లా ఇట్లా కాదు ఏకంగా టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు అలెన్. 33 బాల్స్ మాత్రమే ఆడి 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలటమే కాదు ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 13 ఓవర్లోనే 173 పరుగులను అందుకుని న్యూజిలాండ్ ను 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించేలా చేశాడు. ఫిన్ అలెన్ దెబ్బకు సఫారీలకు మరోసారి నాకౌట్ లో చోక్ అయ్యి ఇంటిదారిపట్టగా...ఇవాళ జరిగే ఇంగ్లండ్, భారత్ ల సెమీ ఫైనల్ 2 మ్యాచ్ విజేతతో 8వ తారీఖు కివీస్ జట్టు టీ20 వరల్డ్ కప్పు ఫైనల్ ను అహ్మదాబాద్ లో ఆడనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola