Rohit Sharma Virat Kohli Comebacks | బీసీసీఐ సెలెక్టర్లుకు, కోచ్ గంభీర్ కి సౌండ్ ఆఫ్ చేసిన రోహిత్, కోహ్లీ | ABP Desam
బీసీసీఐ సెలెక్టర్లు, కోచ్ గంభీర్ చెప్పట్లేదు కానీ కోహ్లీ, రోహిత్ లను తొక్కేయాలని ట్రై చేసిన చాలా మంది నోట మాట పడిపోయి ఉంటుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడకుండా ఎలా అయినా రోకోను ఆపేయాలని ట్రై చేసిన అందరికీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ లతో సమాధానాలు చెప్పారు ఈ ఇద్దరు లెజెండ్స్. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే సిరీస్ ను భారత్ 1-2 తేడాతో కోల్పోయినా ఆ సిరీస్ లో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. మొదటి వన్డే వర్షం కారణంగా ఆడే ఛాన్స్ లేకపోయినా రెండో వన్డే లో హాఫ్ సెంచరీ కొట్టిన రోహిత్..ఇక మూడో వన్డేలో సెంచరీ బాదేసి మ్యాచ్ ను గెలిపించాడు కూడా. సిరీస్ భారత్ ఓడిపోయినా రోహిత్ శర్మ కొట్టిన కొట్టుడుకి ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది. 38ఏళ్ల వయస్సులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును నెగ్గి ధోని పేరు మీదున్న రికార్డును బద్ధలు కొట్టాడు కూడా. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ లో ఆడిన మూడు వన్డేల్లో రెండు హాఫ్ సెంచరీలు కొట్టాడు రోహిత్. రాంచీలో 57పరుగులు, నిన్న వైజాగ్ లో 75పరుగులు చేసిన హిట్ మ్యాన్...తను ఆడిన ఆఖరి ఐదు వన్డేల్లో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు కొట్టి ఫుల్ ఫామ్ ను చూపించాడు.
ఆ తర్వాత ఇప్పుడు కోహ్లీ వంతు వచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లోనూ డకౌట్ అయిన కోహ్లీని ఘోరంగా ట్రోల్ చేశారు. గంభీర్ చెప్పింది నిజం..కోహ్లీ వయసైపోయింది. వన్డే వరల్డ్ కప్ కి కష్టం అన్నారు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టి ఫామ్ లోకి వచ్చిన విరాట్..సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మాత్రం విశ్వరూపం చూపించాడు. రాంచీలో సెంచరీ, గువహటిలో సెంచరీ, వైజాగ్ లో హాఫ్ సెంచరీ కొట్టి...సఫారీలతో సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని అందుకుని క్రిటిక్స్ నోళ్లు మూయించాడు. మధ్యలో బీసీసీఐ మీటింగ్ పెడుతోందని ఈ ప్లేయర్లిద్దరితో మాట్లాడుతోందని 2027 వరల్డ్ కప్ కి రోహిత్, కోహ్లీ డౌట్ అని ప్రచారాలు చేసిన ప్లాన్ చేసిన వాళ్లంతా ఇక సైలెంట్ అయిపోవాల్సిందే. కంగారూలపై రోహిత్ రఫ్పాడిస్తే...సఫారీలను కోహ్లీ కమ్మేసి అందరి అనుమానాలను బ్యాట్ తోనే పటా పంచలు చేశారు కాబట్టి.