Rohit Sharma Virat Kohli BGT Australia Tour | టీమ్ కు భారమైనా రోహిత్, కొహ్లీలను భరించాలా.? | ABP Desam

Continues below advertisement

 ఇది అప్పుడెప్పుడో వచ్చిన ఫేమస్ సినిమాలో హీరో డైలాగ్ కాదు. ఇప్పుడు.. మన క్రికెట్ హీరోల గురించి సగటు అభిమానులు చేస్తున్న కామెంట్. నేను మాట్లాడుతోంది.. రోహిత్ కోహ్లీ గురించే. ఇండియాలో వాళ్ల ఫ్యాన్ బేస్ ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్లిద్దరి రికార్డులు తెలిసే మాట్లాడుతున్నావా అని ఫ్యాన్ బోయ్స్ నా పై కోప్పడొచ్చు. అవన్నీ నాక్కూడా తెలుసు. నేను కూడా ఫ్యానే. కానీ అంతటి అభిమానులు కూడా హర్ట్ అయ్యేలా ఉంటోంది వాళ్ల ఆటతీరు. ఆస్ట్రేలియా టూర్ లో ఫెయిల్ అయింది మొదలు.... ‘Happy Retirement’ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. విరాట్ అంటే తిరుగులేని స్టార్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇన్ క్రికెట్ హిస్టరీ. రోహిత్ ఇండియన్ క్రికెట్ లో ఓ లెజెండ్. ఇలాంటి వాళ్లు వాళ్లంతట వాళ్లు రిటైర్ అయ్యేవరకూ అభిమానులు ఎదురు చూస్తుంటారు. సచిన్, ధోనీ విషయంలో అలాగే  జరిగింది. వీళ్లు కూడా వీళ్లు కూడా నచ్చినప్పుడు రిటైర్ అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు అలా లేవు. కోహ్లీ విషయంలో ఇంకో సీజన్ వరకూ చూస్తారేమో కానీ రోహిత్ విషయంలో అయితే ఏమాత్రం ఒప్పుకునేలా లేరు. ఇండియన్ కెప్టెన్ కు ఇప్పుడు లాస్ట్ టెస్టులో ప్లేస్ ఉంటుందా లేదా అన్న టాక్ మొదలైంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram