Rohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desam

 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాంటెంపరరీ క్రికెటర్సే అయినా మోడ్రన్ డే క్రికెట్ లో ఇద్దరూ సమ ఉజ్జీలు అనిపించుకున్న లెజెండ్స్. కోహ్లీ తన బ్యాట్ తో వీర విధ్వంసం సృష్టించి దిగ్గజాల సరసన నిలిస్తే...వైట్ బాల్, రెడ్ బాల్ అనే తేడా లేకుండా నాయకుడిగా టీమిండియాకు వరల్డ్ క్రికెట్ లో సుస్థిరమైన స్థానాన్ని కల్పించాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రీసెంట్ గా బంగ్లాదేశ్ తో 2-0 టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంది భారత్. వరుసగా 18 టెస్టులను స్వదేశం గెల్చుకుని తిరుగులేని ఫామ్ ను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కామెంటేటర్ జతిన్ సప్రూ కి స్పెషల్ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. విరాట్ కోహ్లీ కారణంగానే ఈ రోజుకీ ఇంకా టెస్టులు ఆడుతున్నానని చెప్పాడు రోహిత్ శర్మ. నాడు కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు తనను టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ కు ప్రమోట్ చేశాడని ఫలితంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగానని చెప్పాడు రోహిత్ శర్మ. అప్పటి కోచ్ రవిశాస్త్రి సహకారం కూడా మర్చిపోలేనన్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola