Rohit Sharma Harman Preet Kaur Padma Shri | రోహిత్, హర్మన్ లను వరించిన పద్మశ్రీ | ABP Desam

భారత క్రికెట్ లో  కెప్టెన్ సాబ్ లకు  పద్మ గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం ముందు రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు, భారత మహిళా జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకుడిగా భారత జట్టుకు ఇటీవల కాలంలో టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను అందించి నాయకుడిగా క్రీడారంగంలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మరో వైపు టీమిండియా విమెన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తొలి సారి మహిళా క్రికెట్ లో ప్రపంచకప్పును భారత్ కు అందించి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ ఇద్దరు క్రీడాకారులు క్రికెట్ లో అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం వీరిద్దరిని పద్మశ్రీతో గౌరవించింది. రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్రీడాకారులు అభినందనలు చెబుతున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola