Rohit Sharma Forgot Toss Coin | Ind vs Pak మ్యాచ్ లో బాబర్ నవ్వింది ఇక్కడ ఒక్క చోటే | ABP Desam

 మన హిట్ మ్యాన్ సంగతి తెలిసిందేగా..గజినీకి కజిన్ బ్రదరులా తయారువుతున్నాడు. అన్నీ మర్చిపోతున్నాడు. అలాగే నిన్న ఇండియా పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో కూడా హడావిడి చేశాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే టాస్ వేయాల్సిన కాయిన్ ను గ్రౌండ్ లోకి వచ్చేప్పుడు అంపైరింగ్ స్టాఫ్ రెండు టీమ్స్ లో ఏదో ఒక కెప్టెన్ కి అందిస్తారు. అలా నిన్న రోహిత్ శర్మకు టాస్ కాయిన్ ఇచ్చారు. దాన్ని ప్యాంట్ జేబులో వేసుకున్న రోహిత్ శర్మ ఆ సంగతి మర్చిపోయాడు. కామెంటేటర్ రవిశాస్త్రి ఇచ్చిన ఎలివేషన్లకు మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏమో. టాస్ వేయండి అన్నప్పుడు కాయిన్ ఎక్కడుంది భాయ్ అని బాబర్ ఆజమ్ ని అడిగాడు రోహిత్ శర్మ. తర్వాత మళ్లీ తనే ప్యాంటు జేబు వెతుక్కుని సారీ అంటూ నవ్వుతూ కాయిన్ తీసి టాస్ వేశాడు. రోహిత్ చేష్టలకు బాబర్ ఆజమ్ కూడా హ్యాపీగా నవ్వుకున్నాడు. టాస్ రోహిత్ శర్మ ఓడిపోవటంతో పాకిస్థాన్ బౌలింగ్ తీసుకోవటం టీమిండియా 119 పరుగులకే పరిమితమై పాకిస్థాన్ కు 120 పరుగుల టార్గెట్ ఇవ్వటం జరిగిపోయాయి. బూమ్ బూమ్ బుమ్రా దయ వల్ల పాకిస్థాన్ టార్గెట్ చేరుకోకుండా కట్టడి చేసిన భారత్ మ్యాచ్ గెలవగా..రోహిత్ శర్మ ఈ టాస్ కాయిన్ మర్చిపోయిన విజువల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ చాలా సార్లు రోహిత్ శర్మ గ్రౌండ్ లోకి వచ్చాక ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని అడిగితే పేర్లు మర్చిపోయి ఫన్ క్రియేట్ చేస్తాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola