Rohit Sharma Emotional After T20 World Cup Win | టీ20 ప్రపంచకప్ ను గెలిచి ఎమోషనలైన రోహిత్ శర్మ | ABP

 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత ఎమోషనల్ మనకు కొత్తగా తెలియంది కాదు. రెండేళ్ల కాలంలో మూడుసార్లు టీమిండియాను ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ కు చేర్చిన కెప్టెన్ రోహిత్ శర్మ...మొదటి రెండుసార్లు తన మిషన్ లో ఫెయిలయ్యాడు. ప్రత్యర్థులకు ఫైనల్ మ్యాచ్ లు కోల్పోవటం ద్వారా తృటిలో ప్రపంచకప్ లను మిస్సయి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో దానికి బదులు తీర్చుకోవాలని కెరీర్ చరమాంకంలో టీమిండియాకు కెప్టెన్ గా ఓ వరల్డ్ కప్ ను అందించాలని కలను కన్న రోహిత్ శర్మ...ఈ టీ20 వరల్డ్ కప్ ద్వారా దాన్ని నెరవేర్చుకున్నాడు. సెమీఫైనల్లో ఇంగ్లండ్ పైన విజయంతోనే కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ...ఫైనల్ మ్యాచ్ లో విజయం తర్వాత ఇక తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. రబాడా ఔట్ అవ్వగానే భారత్ 7పరుగుల తేడాతో ప్రపంచకప్ ను అందుకుంది. అంతే ఉన్నచోటనే కుప్పకూలిపోయాడు రోహిత్ శర్మ. ఉబికి వస్తున్న కనీళ్లను ఆపుకోలేక నేల మీద బోర్లా పడుకుని విల విలా ఏడ్చేశాడు. దేనికోసమైతే ఇన్నేళ్లుగా కలలు కలలు కన్నాడో..ఆ కోరిక 17ఏళ్ల తర్వాత తీరేసరికి కన్నీటిని ఆపుకోలేకపోయాడు. తనకి ఎంతో ఇష్టమైన కొహ్లీ ని దగ్గర తీసుకుని తన సంతోషాన్ని పంచుకున్నాడు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హార్దిక్ పాండ్యాకు అయితే ఓ ముద్దునే బహుమతిగా ఇచ్చేశాడు. ఆ తర్వాత చేసిన పనిని భారతీయ త్రివర్ణ పతాకాన్ని తీసుకుని వచ్చి కరీబియన్ గడ్డపై పాతి టీమిండియా ఘనతను సగర్వంగా చాటాడు. నాయకుడిగా ప్రపంచకప్ ను ఆకాశానికి ఎత్తి టీమిండియాకు ప్రపంకప్ కరువును తీర్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola