Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants )కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant ) సరికొత్త అవతారంలో కనిపించాడు. గత ఐదు నెలలుగా బరువు తగ్గడమే కాకుండా పూర్తిగా మారిపొయ్యాడు. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పంత్, ఈసారి సెలెక్టర్లకు తన సత్తా ఏంటో చూపించాలని రెడీ అవుతున్నాడు. 

ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంత్ ముంబైలో క్రికెటర్ యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడట. శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ), అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) వంటి స్టార్లను తీర్చిదిద్దిన యువీ.. పంత్‌కు షాట్ సెలక్షన్, బ్యాట్ స్వింగ్, మెంటల్ క్లారిటీపై పాఠాలు నేర్పుతున్నారట. బ్రేక్ కూడా లేకుండా బ్యాటింగ్ చేస్తూ, బౌలర్లు అలసిపోయేలా చేస్తున్నాడట పంత్. తన బలహీనతలను బలాలగా మార్చుకునే పనిలో పడ్డాడు. 

ప్రస్తుతం టీమిండియా వైట్-బాల్ క్రికెట్‌లో సంజు శామ్సన్ ( Sanju Samson ), ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), కె.ఎల్ రాహుల్ ( KL Rahul ) నుండి గట్టి పోటీ ఉండటంతో పంత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఐపీఎల్ సీజన్‌ లో సత్తా చాటి టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola